భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

భారత్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి సమాచారం ఇచ్చినవారికి బహుమతి ప్రకటించాడు.

New Update
gurpatwant singh pannun

CRPF Schools: ప్రస్తుతం దేశంలో వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా నవంబర్‌ 26 నుంచి సీఆర్పీఎఫ్‌ స్కూళ్లను మూసివేయాలని అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ నోట్ పంపాడు. అమిత్‌ షా విదేశీ పర్యటనలపై ముందస్తు సమాచారమిస్తే మిలియన్‌ డాలర్లు బహుమతి ఇస్తానని ఆఫర్‌ చేశాడు.  హోం మంత్రి అమిత్‌షా భారత సీఆర్పీఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్నారని అన్నాడు. హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు కిరాయి హంతకులను ఆయనే నియమించారని ఆరోపించాడు. న్యూయార్క్‌లో తన హత్యకు కుట్ర పన్నారు అని వ్యాఖ్యలు చేశాడు.

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

మొన్న స్కూళ్లకు బాంబ్ బెదిరింపు...

రెండు రోజుల క్రితం దేశంలోని సీఆర్‌పీఎఫ్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపారు కొందరు దుండగులు. ఇటీవలే ఢిల్లీ సీఆర్‌పీఎఫ్‌ స్కూల్ వద్ద పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో భయాందోళనలు పరిస్థితులు నెలకొన్నాయి. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు మెయిల్‌లో దుండగులు పేర్కొన్నారు. వచ్చిన బాంబ్ బెదిరింపు మెయిల్స్ లో రెండు ఢిల్లీలోని CRPF స్కూళ్ళు.. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న CRPF స్కూళ్ళో బాంబ్ ఉందంటూ హెచ్చరికలు వచ్చాయి. కాగా ఈ బాంబ్ బెదిరింపు మెయిల్స్ అన్ని నిన్న అర్థరాత్రి వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఢిల్లీలో పేలిన బాంబ్...

ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట పేలుడు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ (NIA) రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు శబ్ధం వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్‌ వేవ్స్ వల్ల దగ్గర్లో ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

Advertisment
Advertisment
తాజా కథనాలు