ఇజ్రాయెల్‌ ఊచకోత.. మరో పెద్ద తలకాయ హతం!

హిజ్బుల్లా పెద్ద తలకాయలే లక్ష్యంగా లెబనాన్‌ గడ్డపై ఇజ్రాయెల్‌ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటికే హసన్ నస్రల్లాని చంపేయగా.. ఇప్పుడు ఆయన వారసుడు హషేమ్ సఫీద్దీన్‌ ను సైతం లేపేశారు. దీంతో హిజ్బుల్లాకు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది.

New Update

హసన్ నస్రల్లాని చంపేశారు.. ఇప్పుడు ఆయన వారసుడు హషేమ్ సఫీద్దీన్‌కు లేపేశారు.. హిజ్బుల్లా పెద్ద తలకాయలే లక్ష్యంగా లెబనాన్‌ గడ్డపై ఇజ్రాయెల్‌ సృష్టిస్తోన్న మారణహోమాంలో అక్కడి నేతలు పిట్టల్లా రాలుతున్నారు. నిజానికి మూడు వారాల క్రితమే బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లోనే సఫీద్దీన్ మరణించాడని అప్పుడే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడు ఎవరూ కూడా సఫీద్దీన్‌ మరణాన్ని నిర్ధారించలేదు.  ఇక తాజాగా ఇజ్రాయెల్ సైన్యంతో ఇరాన్‌కు చెందిన ఓ మిలిటెంట్‌ సంస్థ సఫీద్దీన్‌ మరణవార్తను ధ్రువీకరించింది. దీంతో హిజ్బుల్లాకు ప్రస్తుతం దిక్కు లేకుండా పోయింది.

సఫీద్దీన్‌ ఇస్లాం మత గురువు కూడా..

ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయిన సఫీద్దీన్ హిజ్బుల్లా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. అటు సైనిక కార్యకలాపాలను నిర్వహించే జిహాద్ కౌన్సిల్‌లో కూడా సఫీద్దీన్ కీలక సభ్యుడు. ఇక నస్రల్లాకు సఫీద్దీన్ బంధువు కూడా. అటు సఫీద్దీన్‌ నల్లటి తలపాగాను ధరిస్తాడు. ఇలా నల్లటి తలపాగాను కేవలం కొద్ది మంది నేతలే ధరిస్తారు. ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ సంతతికి చెందిన వారి భావించేవారు ఇలా ధరిస్తారు. ఇక సఫీద్దీన్‌ ఇస్లాం మత గురువు కూడా!

Also Read: సియోల్‌లో తెలంగాణ మంత్రుల టీమ్ పర్యటన.. మూసీ ఎలా మారనుందంటే ?

2017లో టెర్రరిస్ట్ గా గుర్తింపు..

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ 2017లో సఫీద్దీన్‌ను టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక చర్యలకు సఫీద్దీన్‌ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 2006లో లెబనాన్ యుద్ధం, సిరియా యుద్ధంలో హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలు నిర్వహించే సమయంలో సఫీద్దీన్‌ అమాయకుల ప్రాణాల్ని కూడా బలిగొన్నాడన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకోని ఇతరులను చంపేలా యుద్ధ వ్యూహాలు అమలు చేశాడని సఫీద్దీన్‌పై అనేక ఆరోపణలున్నాయి. ఈ వ్యూహం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘిస్తుంది.

Also Read: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు!

లెబనాన్‌లో తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారిని బెదిరించడం, అణచివేయడం లాంటి చర్యలకు సఫీద్దీన్‌ ప్రయత్నించాడని ఇజ్రాయెల్‌ మీడియా చెబుతుంటుంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు తమకు వ్యతిరేకంగా గళం విప్పేవారిని సైతం సఫీద్దీన్‌ కిడ్నాప్‌లు చేశాడట. సిరియన్ సివిల్ వార్‌లో హిజ్బుల్లా ప్రమేయం మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమైంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు అక్కడి నియంత అసద్ పాలనకు మద్దతు ఇవ్వడం లాంటివి దురాగతాలకు పాల్పడింది.

Also Read: మహావికాస్ అఘాడి VS మహాయుతి.. కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు !

నిజానికి సఫీద్దీన్ కుటుంబ బంధాలు, నస్రల్లాతో ఉన్న సారూప్యత, అలాగే మహమ్మద్ వంశస్థుడిగా మతపరమైన హోదా.. ఇలా అన్నీ ఆయనకు హిజ్బుల్లాను ముందుండి నడిపించడానకి దగ్గర చేశాయి. అయితే నస్రల్లా తర్వాత సఫీద్దీన్‌ కూడా మరణించడం హిజ్బుల్లాను అనాధను చేసిందనే చెప్పాలి. మరోవైపు గాజాలో పాలస్తీనా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూపును పూర్తిగా నాశనం చేసేంత వరకు పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ఖరాఖండిగా చెబుతోంది. అటు హమాస్‌ చేరలో ఇప్పటికే ఇజ్రాయెల్‌ పౌరులు కొందరు బందీలగా ఉన్నారు. ఇక ఇజ్రాయెల్‌ ఎంతమందిని చంపినా, ఎవర్ని చంపినా బందీలను మాత్రం వదలే ప్రశక్తే లేదని హమాస్‌ కుండబద్దలు కొడుతోంది.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి కూల్చివేతలు.. గుండెల్లో గుబులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు