హస్తానికి హ్యాండిచ్చిన హర్యానా.. క్రికెట్‌ మ్యాచ్‌ను తలపిస్తోన్న కౌంటింగ్!

హర్యానా ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా సేపటి వరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించగా.. సడెన్ గా లీడ్ లోకి వచ్చిన బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.

author-image
By Nikhil
New Update

హర్యానా ఎన్నికల కౌంటింగ్‌ హై వోల్టెజ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తలపిస్తోంది. మార్నింగ్‌ కౌంటింగ్‌ మొదలైన సమయంలో కాంగ్రెస్‌ లీడ్‌లో ఉండగా.. ఇప్పుడు ఆ లీడ్‌ బీజేపీకి వెళ్లింది. నిజానికి ఎగ్జిట్‌ పోల్స్‌ హర్యానాలో కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. అయితే ప్రస్తుత ట్రేండ్‌ మాత్రం బీజేపీ వైపు ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఇరు పక్షాలు కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మూడో రౌండ్ నుంచి సీన్ రివర్స్..

హర్యానాలో మూడో రౌండ్‌ నుంచి ఫలితాలు తలకిందులు అవుతున్నాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జులానా స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజలో ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు