/rtv/media/media_files/2026/02/07/epstein-files-2026-02-07-13-46-31.jpg)
Epstein Files
Epstein Files: ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులను షేక్ చేస్తున్న అంశం ఎప్స్టీన్ ఫైల్స్. ఈ కేసు గురించి ఎన్నేళ్లుగా చర్చ జరుగుతున్నా, తాజాగా ఒక్కొక్కటిగా రహస్య డాకుమెంట్స్ బయటకు రావడంతో మళ్లీ సంచలనం మొదలైంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కి కూడా చేరింది. హిందీ సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, ప్రముఖ రచయిత దీపక్ చోప్రా. దీంతో బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), దీపక్ చోప్రా(Deepak Chopra) క్లారిటీ
ఎప్స్టీన్ నిర్వహించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ కశ్యప్ 2017లో బీజింగ్ వెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్,
“నాకు చాలా ఆహ్వానాలు వస్తాయి. కానీ నేను ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా బీజింగ్ వెళ్లలేదు” అంటూ స్పష్టంగా ఖండించారు. ఇక దీపక్ చోప్రా మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఎలాంటి నేరపూరిత పనుల్లో పాల్గొనలేదు. ఎప్స్టీన్తో నా పరిచయం చాలా పరిమితమే. లైంగిక నేరాల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు.
THREAD: WHAT THE EPSTEIN FILES ACTUALLY SHOW (AND DON’T SHOW)
— Mossad Commentary (@MOSSADil) February 6, 2026
Source: TOI
1/12
A new release of millions of documents from the Jeffrey Epstein investigation is fueling a familiar claim online:
“That Epstein worked for Mossad.”
Here’s the context most people aren’t seeing. pic.twitter.com/ZoYLqlbFKv
అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి?
అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలనే ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఎప్స్టీన్ ఓ అమెరికన్ బిలియనీర్. అతను మైనర్ బాలికలను లైంగిక అక్రమ రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 2019లో జైలులో ఉన్న సమయంలో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో సేకరించిన కోర్టు పత్రాలు, సాక్ష్యాలు, విమాన ప్రయాణ వివరాలు, కాంటాక్ట్ లిస్టులను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా బయటకు తీస్తోంది. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తుల పేర్లు ఉండటంతో కలకలం రేగుతోంది. అయితే ఫైల్స్‌లో పేరు ఉండటం మాత్రమే నేరానికి రుజువు కాదు. కొందరు ఎప్స్టీన్కు తెలిసినవారు, కొందరు అతని విమానంలో ప్రయాణించినవారు మాత్రమే.
ఫైల్స్ ఎందుకు పూర్తిగా బయటకు రావడం లేదు?
ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి ఒకే డాక్యుమెంట్ కావు. ఇవి FBI రికార్డులు, కోర్టు పత్రాలు, గ్రాండ్ జ్యూరీ ఫైల్స్ లాంటి అనేక విభాగాలుగా ఉన్నాయి. వీటిని విడుదల చేయడానికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన చాలా పత్రాల్లో పేర్లు, ఫోటోలు, అడ్రస్‌లు నల్లగా కప్పివేశారు. దీనికి కారణం బాధితులు, సాక్షులు, సంబంధం లేని వ్యక్తుల గోప్యతను కాపాడటమే. అయితే కొన్ని చోట్ల ఎందుకు కప్పారో స్పష్టత లేకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.
ఎవరు ఏం దాచాలో ఎవరు నిర్ణయిస్తారు?
అమెరికాలో FOIA చట్టాలు (సమాచార హక్కు చట్టాలు) ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి. అయితే కోర్టు పత్రాలు, గ్రాండ్ జ్యూరీ రికార్డుల విషయంలో న్యాయమూర్తులే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే అన్ని ఫైల్స్‌ను ప్రభుత్వం నేరుగా విడుదల చేయలేవు. వేర్వేరు శాఖలు వేర్వేరు పత్రాలు చూసే కారణంగా, ఒక చోట కప్పిన విషయం మరొక చోట కనిపించడం కూడా జరుగుతోంది.
ట్రంప్ సంతకం.. ఇంకా పెద్ద దుమారం?
ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేయాలనే బిల్లుపై సంతకం చేశారు. దీని వల్ల దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000కు పైగా వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ వివాదం ఇంకా పెద్ద స్థాయిలో చర్చకు రావడం ఖాయం. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఒక వైపు ఉంటే, నిరపరాధుల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మరోవైపు ఉంది. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం పాటించకపోతే, నిజం దాచేస్తున్నారన్న అనుమానం పెరుగుతోంది.
మొత్తానికి ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. మరిన్ని పేర్లు, మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో, ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలాకాలం చర్చలో ఉండనుంది.
Follow Us