వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికాను ప్రపంచవ్యాప్తంగా ‘ఆక్రమిత అమెరికా’ అని పిలుస్తున్నారని అన్నారు ట్రంప్. అమెరికా భూభాగాన్ని నేరస్థులు ఆక్రమించుకున్నారుని చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విదిస్తానని వ్యాఖ్యలు చేశారు.

New Update
trump

Trump: అక్రమ వలసదారులపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ దుమ్మెత్తి పోశారు. అమెరికాను ప్రపంచవ్యాప్తంగా ‘ఆక్రమిత అమెరికా’ అని పిలుస్తున్నారని అన్నారు. మన భూభాగాన్ని నేరస్థులు ఆక్రమించుకున్నారని చెప్పారు. అందుకే నవంబర్‌ 5 అమెరికా విముక్తి దినోత్సవం కాబోతోందని దేశం అంతటా ఉన్న ప్రజలకు మాటిచ్చారు. వెనెజువెలా గ్యాంగ్‌ ట్రెన్‌ డె అరగువాను ఏరిపారేయడానికి ‘ఆపరేషన్‌ అరోరా’ చేపడతానని హామీ ఇచ్చారు. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ పై కేజ్రీవాల్ ట్వీట్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక హామీ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేవలం 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దీని కారణంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని.. మరీ ముఖ్యంగా అమెరికా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ పోస్టుకు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించడం పై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘ ఉచిత తాయిలాలు అమెరికా వరకు వెళ్లాయి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు