BREAKING: ఘోర ప్రమాదం... 78మంది మృతి! కాంగో దేశంలో గోమా ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కివు సరస్సుపై ప్రమాదవశాత్తు బోటు నీటిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 04 Oct 2024 in ఇంటర్నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Congo Boat Accident: మిడిల్ ఆఫ్రికా దేశమైన కాంగోలోని కివు సరస్సులో గురువారం పడవ బోల్తా పడిన ఘటనలో 78 మంది మరణించారు. ప్రమాదం జరిగే సమయంలో పడవలో 278 మంది ఉన్నారని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ తెలిపారు. కనీసం 78 మంది మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. సామర్థ్యం కంటే ఎక్కువ... అంతకుముందు, బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని కిటుకు ఓడరేవుకు కొన్ని మీటర్ల దూరంలో పడవ మునిగిపోయింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. This boat capsized today on Lake Kivu in Goma Congo. At least 50 lifeless bodies have been recovered. Rescue efforts are ongoing.It is said that the boat, overloaded with passengers, sank while trying to dock just meters away from the port of Kituku. It was going from Minova… pic.twitter.com/0FiMoWNpsS — Mike Sonko (@MikeSonko) October 3, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి