BIG BREAKING: మరో ఫ్లైట్ క్రాష్.. లైవ్ వీడియో

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాఢమైన నల్ల పొగ ఎగసిపడడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. పైలట్ బయటకు దూకాడా లేదా ఇంకా తెలియలేదు. అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరాయి.

New Update
BIG BREAKING

BIG BREAKING

BIG BREAKING: దుబాయ్ ఎయిర్ షోలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ షోలో పాల్గొన్న భారత తేజస్ ఫైటర్ జెట్ ఆకస్మికంగా కూలిపోయింది(FIGHTER JET CRASH). మధ్యాహ్నం సుమారు 2:10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనను వేలాది మంది ప్రత్యక్షంగా చూసారు.

విమానం కూలిన వెంటనే సంఘటనా స్థలంలో నుంచి గాఢమైన నల్ల పొగ ఎగసిపడింది. దీనితో అక్కడ ఉన్న వారంతా, ప్రత్యేకంగా పిల్లలతో వచ్చిన కుటుంబాలు, భయంతో పరుగులు తీశారు. విమానం ప్రమాదానికి గురయ్యే ముందు పైలట్ బయటకు దూకాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఎయిర్‌పోర్ట్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో భద్రతా సిబ్బంది, అత్యవసర సేవా బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రమాదంపై అధికారుల నుంచి ఇంకా పూర్తి సమాచారం రాలేదు. ప్రమాదానికి గల అసలు కారణం, పైలట్ పరిస్థితి వంటి వివరాలు తరువాత వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనతో దుబాయ్ ఎయిర్ షోలో ఆందోళన వాతావరణం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు