AP: పోలవరంలో రెండో రోజు నిపుణుల బృందం పర్యటన.. కీలక విషయాలపై అధికారులతో చర్చ..! పోలవరంలో రెండో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్ట్‌ను నలుగురు నిపుణులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌజ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో భేటీ అయిన బృందం పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు. డయా ఫ్రమ్ వాల్ పై ఫోకస్ పెట్టారు. By Jyoshna Sappogula 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Polavaram Project: పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండో రోజు పర్యటిస్తోంది. ప్రాజెక్ట్‌ను నలుగురు నిపుణులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌజ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో భేటీ అయిన బృందం పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు. Also Read: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల నిన్న స్పిల్ వే నిర్మాణం, మ్యాప్ పై అధ్యయనం చేసిన నిపుణులు ఎగువ కాపర్ డ్యామ్ (Copper Dam) శాంపిల్స్ ను సేకరించి.. డ్యామ్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ రోజు పూర్తిగా డయా ఫ్రమ్ వాల్ పై ఫోకస్ పెట్టారు. మరో రెండురోజుల పాటు పోలవరంలోనే జలవనరుల బృందం పర్యటించనుంది. ఇంజనీర్, పీపీఏ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీలతో అధికారుల బృందం చర్చించనుంది. #polavaram-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి