INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ప్రసిద్ధ్ కృష్ణ గట్టి షాక్ ఇచ్చాడు. By BalaMurali Krishna 24 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి INDvsAUS: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ప్రసిద్ధ్ కృష్ణ గట్టి షాక్ ఇచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్లోనే మాథ్యూ షార్ట్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేశాడు. తర్వాత వర్షం మ్యాచుకు అంతరాయం కలిగించడంతో కాసేపు ఆట ఆగిపోయింది. అయితే వరుణుడు కరుణించడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు అంపైర్లు. దీంతో ఆస్ట్రేలియా జట్టు టార్గెట్ 317 పరుగులుగా నిర్ణయించారు. బ్యాటింగ్‌కు వచ్చిన కంగారు జట్టును భారత బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. దాంతో ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు తీశారు. That's that from the 2nd ODI. Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8 — BCCI (@BCCI) September 24, 2023 అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ శుభమన్ గిల్, వన్ డౌన్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన అయ్యర్ క్రీజులోకి వచ్చిన దగ్గరి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లను కంగారు పెట్టించాడు. మరోవైపు గిల్ కూడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే ముందుగా అయ్యర్ సెంచరీ కొట్టేశాడు. కొన్ని రోజులుగా గాయాలతో సతమవుతున్న అయ్యర్.. రీఎంట్రీలో ఇటీవల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. దీంతో జట్టులో అయ్యర్ స్థానంపై సందేహం నెలకొంది. ఈ మ్యాచులో కూడా విఫలమైతే ఇక వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో పక్కన పెట్టడమే అని అందరూ భావించారు. కానీ అయ్యర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పడిలేచిన కెరటంలా సెంచరీతో తన సత్తా మరోసారి చాటిచెప్పాడు. ఇక గిల్ కూడా యథాప్రకారం అదరగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 37, అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఇదే ఊపులో శ్రేయస్ 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అబాట్ బౌలింగ్‌లో 105 పరుగులతో ఔటయ్యాడు. అనంతరం గిల్ కూడా సెంచరీ కొట్టి 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడటండో స్కోర్ 40ఓవర్లలోనే 300 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే 31 పరుగుల వద్ద ఇషాన్ పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 52 పరుగులు చేయడంతో భారత్ 399/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది కూడా చదవండి: రజతంతో భారత్ శుభారంభం..ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు..!! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి