India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 302 పరుగుల తేడాతో జయకేతనం

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సరికొత్త రికార్డ్ సృష్టించింది. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 302 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక 19 ఓవర్లకు 55 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

New Update
India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 302 పరుగుల తేడాతో జయకేతనం

India Won on Srilanka: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సరికొత్త రికార్డ్ సృష్టించింది. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొద్దిలో రికార్డ్ మిస్ అయినా.. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 302 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇదే ఏడాది అంటే జనవరి 2023లో శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఇప్పుడు  అంతే స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. టీమిండియా బౌలర్లు సిరాజ్, మహ్మద్ షమీ దెబ్బకు టప టపా వికెట్లు సమర్పించుకున్నారు శ్రీలంక బ్యాట్స్‌మెన్. దాంతో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు.. కేవలం 55 పరుగులకే చతికిలపడిపోయారు. 19.4 ఓవర్లకు 55 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో  షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, బూమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టి లంక బ్యాటర్స్ ను హడలెత్తించారు.

టీమిండియా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే.. శుభ్‌మన్ గిల్ 92(6*2-4*11) పరుగులతో దుమ్మురేపాడు. విరాట్ కోహ్లీ 11 ఫోర్లతో 94 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ దూకుడు మామూలుగా లేదు. జస్ట్ 56 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 82 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను భారీగా పెంచేశాడు. రవీంద్ర జడేజా 35, కేఎల్ రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగుల చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 357 పరుగులు చేసిన టీమిండియా శ్రీలంక ముందు 358 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన శ్రీలంక.. మొదటి నుంచే తుస్ మనిపించింది. బుమ్రా వేసిన తొలి బంతికే వికెట్ సమర్పిచుకుంది శ్రీలంక టీమ్. శ్రీలంక టీమ్‌లో ఏంజెలో మాథ్యూస్ 12, మహేష్ తీక్షణ 12*, కసున్ రజిత 14 మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇక ఓపెనర్లు ఇద్దరూ గోల్డెన్ డకౌట్‌ అయ్యారు.

సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా..

2023 వరల్డ్ కప్ ట్రోఫీలో సెమీఫైనల్ కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తూ వచ్చింది.

వన్డే హిస్టరీలో అతిపెద్ద విజయాలు..

🏏317 - IND vs SL, త్రివేండ్రం 2023
🏏309 - AUS vs NED, ఢిల్లీ, 2023 (WC)
🏏304 - ZIM vs UAE, హరారే, 2023
🏏IND v Sri Lanka, Wankhede, 2023*(WC)
🏏290 - NZ vs IRE, అబెర్డీన్ 2008
🏏275 - AUS vs AFG, పెర్త్ 2015 (WC)

టీమిండియాపై జై షా ప్రశంసల వర్షం..

Also Read:

కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

 హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని

Advertisment
Advertisment
తాజా కథనాలు