India vs Australia World Cup 2023: దుమ్మురేపుతున్న కోహ్లీ, రాహుల్.. విజయం దిశగా టీమిండియా..

జోడు గుర్రాల్లా జోరుమీదున్నారు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. వికెట్ కోల్పోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూ.. టీమ్ స్కోర్‌ను పెంచారు. ఇద్దరి భాగస్వామ్యంలో 115 పరుగులు చేశారు. టీమ్‌ను విజయ తీరం వైపు నడిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 152/3 (35.2)గా ఉంది.

New Update
India vs Australia World Cup 2023: దుమ్మురేపుతున్న కోహ్లీ, రాహుల్.. విజయం దిశగా టీమిండియా..

India vs Australia World Cup 2023: ఆరంభంలో కాస్త అలజరి రేపినా.. ఆ తరువాత టీమిండియా నిలదొక్కుకుంది. వరుసగా 3 వికెట్లు కోల్పోయి.. టీమిండియా విజయం సాధించేనా అనుకున్న దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోరు గుర్రాల మాదిరిగా జోరు పెంచి ఆడుతున్నారు. వికెట్ కోల్పోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూ.. టీమ్ స్కోర్‌ను పెంచారు. ఇద్దరి భాగస్వామ్యంలో 115 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. టీమ్‌ను విజయ తీరం వైపు నడిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 152/3 (35.2)గా ఉంది.

200 పరుగుల లక్ష్యంతో..

వన్డే ప్రపంచ కప్‌ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ టీమ్ 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబాటుకు గురై.. వరుస వికెట్లు సమర్పించుకుంటుంది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read:

ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!

Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు