ముంచుకొస్తున్న తుఫాన్‌..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. కొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తుఫాన్‌ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదన్నారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

New Update
ముంచుకొస్తున్న తుఫాన్‌..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!!

India Meteorological Department: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీ(RTV)తో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.


విశాఖలో వాతావరణ శాఖ అధికారి సునంద ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్ గా మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని చెప్పుకొచ్చారు. అయితే, తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదని సునంద తెలిపారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

Also Read: యుద్ధం తీవ్రతరమైతే అది మీ దాకా వస్తుంది.. ఆ దేశానికి అమెరికా హెచ్చరికలు

ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ(India Meteorological Department) వివరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. క్రమంగా తుపానుగా మరి అనంతరం తీవ్ర తుపానుగా మారే ఛాన్స్ కనిపిస్తోందని తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు