Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో తెలుసా! వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు భారత హాకీ టీమ్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.భారత జట్టు బ్రిటన్‌ను మట్టి కరిపించి ముందుకు దూసుకెళ్లింది.హాకీ సెమీఫైనల్‌లో పటిష్టమైన జర్మనీ జట్టుని భారత్ ఢీకొట్టడం ఫైనల్ అయ్యింది. By Bhavana 05 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Paris Olympics 2024: వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు భారత హాకీ టీమ్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు బ్రిటన్‌ను మట్టి కరిపించి ముందుకు దూసుకెళ్లింది. ఇప్పుడు భారత్ తో సెమీఫైనల్ లో తలపడే ప్రత్యర్థి ఎవరో ఖరారు అయిపోయింది. హాకీ సెమీఫైనల్‌లో పటిష్టమైన జర్మనీ జట్టుని భారత్ ఢీకొట్టడం ఫైనల్ అయ్యింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాను జర్మనీ 3-2తో ఓడించింది. దీంతో సెమీ ఫైనల్లో ఆగస్టు 6న (మంగళవారం) రాత్రి 10:30 గంటలకు సెమీఫైనల్‌లో జర్మనీతో భారత తలపడనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా మళ్లీ ఇప్పుడు ఒలింపిక్స్‌లో మరోసారి కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నాయి. మరో సెమీఫైనల్‌లో స్పెయిన్-నెదర్లాండ్స్ తలపడనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు చేరింది. ఇక స్పెయిన్ జట్టు 3-2తో బెల్జియంను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. Also read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..93 మంది మృతి! #paris-olympics #hockey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి