గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్! CM KCR Unveiled the National Flag: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన రాణి మహల్ కు చేరుకున్నారు. తెలంగాణ కళాకారుల బృందం.. డప్పు చప్పుళ్ల మధ్య ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తరువాత సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని అక్కడున్న వారందరూ ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతి నివేదికను తెలియపర్చుతూ.. కేసీఆర్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్నారు. By P. Sonika Chandra 15 Aug 2023 in తెలంగాణ New Update షేర్ చేయండి CM KCR Unveiled the National Flag: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన రాణి మహల్ కు చేరుకున్నారు. తెలంగాణ కళాకారుల బృందం.. డప్పు చప్పుళ్ల మధ్య ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తరువాత సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని అక్కడున్న వారందరూ ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతి నివేదికను తెలియపర్చుతూ.. కేసీఆర్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి భారత దేశ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు సీఎం కేసీఆర్ తెలిపారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తిని ఇప్పించడానికి ప్రాణత్యాగం చేసిన దేశభక్తులందరికి వందనమన్నారు. గతేడాది వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నామన్న కేసీఆర్ ఈ ఏడాది వజ్రోత్సవాల ముగింపును కూడా అంతే వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. అయితే ఇన్నాళ్ల స్వాతంత్ర్య భారత దేశం ఇంకా సాధించాల్సిన పురోగతి చాలా ఉందని చెప్పక తప్పదన్నారు సీఎం కేసీఆర్. This is an updating story Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్…ఇండియన్ టెక్స్టైల్ క్రాఫ్ట్స్‌తో గూగుల్ డూడుల్..!! #cm-kcr #cm-kcr-unveiled-the-national-flag #cm-kcr-at-golconda-fort #independence-day-celebrations-in-telangana #telangana-cm-kcr-hoists-national-flag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి