Telugu Freedom Fighters: తొడగొట్టిన తెలుగు జాతి వీరులు.. బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన యోధులు! కొందరిది అహింసా మార్గం.. మరికొందరిది విప్లవ మార్గం.. ఆంధ్ర నుంచి ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు తమ జీవితాలను పణంగా పెట్టి, తర్వాతి తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాడారు. వారి గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Archana 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Telugu Freedom Fighters: ఆంగ్లేయుల బలం ఆయుధాలు.. కానీ ఆంధ్రోళ్ల బలం ఆత్మవిశ్వాసం.. పోరాడే తత్వం.. తెగించే నైజం..! అందుకే నాడు తెల్లదొరలు తలవంచారు. దేశాన్ని తెల్ల పాలకుల నుంచి విముక్తి చేసేందుకు పోరాడిన వారిలో తెలుగు వారికి ప్రత్యేక స్థానం ఉంది. సాయుధ మార్గంలో పోరాడినా, గాంధేయ పద్ధతిలో నిరసనలకు దిగినా బ్రిటిషర్లకు చెమటలు పట్టేవి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ బ్రిటిషర్లపై పోరాడిన తెలుగు వారిని ఓ సారి గుర్తు చేసుకుందాం..! అల్లూరి తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఓ అధ్యాయం. స్వాతంత్ర్యం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గం అని నమ్మిన అల్లూరి.. తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించారు. పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పేరు వినగానే అందరికి ఆంధ్ర రాష్ట్రమే గుర్తొస్తుంది. అయితే శ్రీరాములు దేశ స్వాతంత్ర్యం కోసం గాంధేయ మార్గంలో పోరాడిన వారిలో చాలా ముఖ్యమైన వారు. గాంధీజీతో పాటు పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు. అటు శ్రీరాములు కేవలం దేశ స్వాతంత్రం కోసమే కాదు.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యంగా అనేక సభలకు అధ్యక్షత వహించారు. 1921లో నాగ్‌పుర్ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఎందరో మహనీయులు తమ వృత్తులను మానేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం కూడా అదే బాటలో నడిచారు. దేశం కోసం వృత్తిని విడిచి పెట్టారు. స్వరాజ్య పత్రికను ప్రారంభించి... నిర్భయంగా వార్తలను అందిస్తూ బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన ఆ పత్రిక ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో వెలువడేది. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని నాటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకాశం ముందుండి నడిపించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీజీకి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు పట్టాభి సీతారామయ్య. గాంధీజీ సూత్రకారుడైతే దాని భాష్యకారుడు పట్టాభి. భారతీయ స్వాతంత్రోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటా మహాత్మా గాంధీ వెన్నంటి ఉండి ఆయన నిర్మాణ కార్యక్రమాలన్నిటికీ ఊపునిచ్చినవారు పట్టాభి. ఇలా అహింసా మార్గంతో పాటు విప్లవ మార్గంలోనూ ఆంధ్ర నుంచి ఎందరో స్వాతంత్య్ర సమరవీరులు తమ జీవితాలను పణంగా పెట్టి, తర్వాతి తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాడారు! Also Read: Nirmala Sitharaman : అది నాకిష్టం లేదు.. కానీ దేశంలో సవాళ్ల మధ్య తప్పడం లేదు.. నిర్మలా సీతారామన్ - Rtvlive.com #independence-day-2024 #telugu-freedom-fighters మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి