IND vs PAK: టీమిండియాకు షాక్.. రోహిత్ శర్మ, కోహ్లీ ఔట్

యావత్ భారత క్రికెట్ అభిమానులకు బాడ్ న్యూస్. వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. అనంతరం కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ మొదలైంది. అయితే ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ.. నాలుగు పరుగులకే ఆఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.

New Update

టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్‌, గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. చాలా కాలం తర్వాత శ్రేయాస్ అయ్యర్, బుమ్రా తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ బెంచ్‌కే పరిమతమయ్యారు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

అంతకుముందు, పాకిస్తాన్ తమ గడ్డపై నేపాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన విజయంతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam), ఇఫ్తికార్ అహ్మద్ సెంచరీలు చేశారు. దీంతో పాటు పాక్ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. 342 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 104 పరుగులకే ఆలౌటయి 238 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. మరి ఇప్పుడు భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు