Ind vs Aus: దుమ్మురేపిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 353 పరుగులు By BalaMurali Krishna 27 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ind vs Aus: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారు జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఆస్ట్రేలియా తుది జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హేజిల్‌వుడ్ Innings break! Australia post 352/7 in the first innings! Over to our batters 💪 Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6 — BCCI (@BCCI) September 27, 2023 మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఇండియా.. సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచులో జట్టులోకి వచ్చారు. ఇక రెండు మ్యాచుల్లో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన బెట్టి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు ఇచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి