పెరుగుతున్న కాలేయ వ్యాధులు..60% పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి!

దేశంలో రోజురోజుకి కాలేయ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇంకా హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ సి లాంటి ప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. 60 శాతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 30 శాతం మాత్రమే ఉంది.

New Update
పెరుగుతున్న కాలేయ వ్యాధులు..60% పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి!

భారత దేశంలో రోజురోజుకి కాలేయ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇంకా హెపటైటిస్ బి, హెపాటోసెల్యులర్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్, హెపటైటిస్ సి లాంటి ప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ ప్రాణాంతక కాలేయ వ్యాధులతో జనం ఎక్కువగా పోరాడుతున్నారు.

ఇక మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఊబకాయం ఉన్న పిల్లల్లో సుమారు 60 శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతున్నట్టు వైద్య నిపుణుల నివేదికల్లో తేలింది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకుంటున్న పిల్లలు, అదే విధంగా స్కూల్ కు వెళ్ళడానికి ట్రాన్స్ పోర్టేషన్ ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సంపన్న వర్గాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్య వర్గం వేసిన అంచనాల ప్రకారం ఈ సమస్య ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 30 శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉండడం గమనార్హం.

అయితే మధుమేహం, ఫ్యాటీ లివర్ లకు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే ప్రధాన కారణం. సిర్రోసిస్ అంటే కాలేయం గట్టిపడడం, లివర్ ఫెయిల్యూర్ వంటివి కూడా దీని ద్వారా సంభవించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, మారుతున్న జీవన శైలితో షుగర్, ఫ్యాటీ లివర్ వ్యాధుల కలయిక తీవ్రమైన సిర్రోసిస్ కు దారి తీస్తోందని  డాక్టర్ రెడ్డీ హెచ్చరిస్తున్నారు. ఇక న్యూఢిల్లీలోని AIIMS ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం కూడా పిల్లలతో సహా సాధారణ జనాభాలో 30% కాలేయ వ్యాధుల పెరుగుతున్నాయని తేలింది.

అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో మాత్రం NAFLD  తక్కువగా ఉన్నట్లు గుర్తించబడింది. కాగా, ఇంతకు ముందు US ఇంకా యూరప్‌లో సాధారణంగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు మన దేశంలో కూడా పెరిగిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రాణాంతకమైన వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు