Vote: కలిసికట్టుగా.. ఒకే జట్టుగా 96 మంది కుటుంబసభ్యులు ఓటేశారు  

కర్ణాటకలోని నోల్వి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 96 మంది ఒకేసారి కలిసి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంఘటన అందరి ప్రశంసలు పండుతోంది. ఆ వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. 

New Update
Vote: కలిసికట్టుగా.. ఒకే జట్టుగా 96 మంది కుటుంబసభ్యులు ఓటేశారు  

మన ఇంట్లో నలుగురు ఉంటే.. నలుగురికీ ఓట్లు ఉంటే అందులో ఇద్దరు ఓటు(Vote) వేయడమా? అని బద్ధకిస్తారు.. ఒకరు పొద్దున్నే వెళ్లి ఓటు వేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. నాలుగో వ్యక్తి సాయంత్రం దాకా చూసి అప్పుడు వెళ్లి ఎదో వేశామన్నట్టు ఓటు(Vote) వేసి వస్తాడు. మొన్న తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ శాతం గుర్తుంది కదా. అంతా చదువుకున్న వారు ఉండి కూడా.. అవగాహన కలిగి కూడా 60 శాతం ఓటర్లు ఓటు వేయకుండా కూచున్నారు. కానీ, ఇప్పుడు కర్ణాటక లో ఒక కుటుంబాన్ని చూస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఇంటిల్లిపాదీ వెళ్లి ఓటు వేసి వస్తారు. నిజం ఆ కుటుంబం చేసిన పని అలాంటిది. 

కర్ణాటకలోని నోల్వి గ్రామంలో కొప్పాడ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు వందమందికి పైగానే ఓటర్లు ఉన్నారు. ఈరోజు అంటే మే 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో వీరిలో 96 మంది… అంటే ఒకే కుటుంబానికి చెందిన 96 మంది ఓటర్లు ఒకేసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి (Vote)ఓటేశారు. అంతా కలిసి కట్టుగా ఒకేసారి ఓటువేయడానికి వెళ్లడం ఒకరకంగా పెద్ద విషయమే అని చెప్పాలి. 

Also Read: కాఫీ ప్రియులకు నోరు కాలిపోయే వార్త

ఇలా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓటు(Vote) వేయడానికి రావడం అందరినీ ఆకర్షించింది. వీరంతా నోల్వి గ్రామంలోని 56, 57 పోలింగ్ బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ పెద్దలు కంటెప్ప కొప్పాడ, సహదేవప్ప కొప్పాడ, ఫకీరవ కొప్పాడతో పాటు 96 మంది ఒకేసారి ఓటు వేశారు. ఇది ఒక్కసారే కాదండోయ్.. గత మూడు అసెంబ్లీ.. రెండు లోక్ సభ ఎన్నికల్లో కూడా వీరంతా ఇలానే కలిసి వచ్చి ఓటు(Vote) వేస్తున్నారట. 

అదండీ విషయం ఓటు విలువ పట్టణాల్లో ఉన్నవారికి తెలిసి వచ్చేలా.. ఈ గ్రామ ఓటర్లు చేసిన పని అందరి ప్రశంసలు పొందుతోంది. మరి ఇది చూశాకా అయినా.. ఈసారి ఎన్నికల్లో మన హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బద్ధకించారని ఆశిద్దాం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు