Immune Boosting Foods: వీటిని తింటే.. ఏ రోగాలు మీ దగ్గరికు రావు..!

శరీరం రోగాల బారిన పడకుండా.. కాపాడడానికి రోగ నిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఆహరం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకని రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

New Update
Immune Boosting Foods: వీటిని తింటే.. ఏ రోగాలు మీ దగ్గరికు  రావు..!

బిజీ బిజీగా సాగుతున్న ఈ రోజుల్లో చాలా వారి ఆహారపు అలవాట్ల పై అశ్రద్ధగా ఉంటారు. సరైన ఆహరం తీసుకోనందున శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతే కాదు దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కావున శరీరం రోగాల బారిన పడకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు..

అల్లం

అల్లం.. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు శరీరంలో వాపు, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తాయి. దీనిలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరం క్రిములు , వైరస్ నుంచి పోరాడే రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.

వెల్లుల్లి

దీనిలో అలిసిన్ కంపౌండ్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడతాయి. అలాగే దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పసుపు 

సహజంగానే పసుపులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి.  పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి.

సిట్రస్ ఫ్రూట్స్ 

సిట్రస్ ఎక్కువగా ఉండే ఆహారాలు.. నారింజ, లెమన్ దీనిలోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని విటమిన్ C ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడే వైట్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

ఆకుకూరలు

వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజు మనం తినే ఆహారంలో వీటిని చేర్చడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్రిములు, వైరస్ నుంచి పోరాడడానికి అవసరమయ్యే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

బాదాం పప్పులు

రోజు వీటిని నీళ్లలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే విటమిన్ E.. యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి శరీర కణాలకు డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. అంతే కాదు వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

Also Read: Millets Benifits: రక్తపోటు, మధుమేహం ఉందా.. వీటిని తప్పక తీసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు