నిరక్షరాస్యులైన ప్రజాప్రతినిధులు.... సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు...!

అన్ అకాడమీలో ఉపాధ్యాయుడు కరన్ సంఘ్వాన్ ను తొలగించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. నిరక్షరాస్యులను తాను వ్యక్తిగతంగా గౌవరిస్తానన్నారు. ప్రజా ప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదని అన్నారు.నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరన్నారు.

author-image
By G Ramu
New Update
Kejriwal Health: క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. 46కు పడిపోయిన షుగర్ లెవల్స్!

ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదని అన్నారు.నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరన్నారు. ప్రముఖ ఎడ్యుటెక్ ప్లాట్ ఫారమ్ అన్ అకాడమీలో వివాదం నడుస్తోంది. చదువుకున్న నేతలకు మాత్రమే ఓట్లు వేయాలంటూ విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు సూచించడంతో ఈ వివాదం మొదలైంది.

అన్ అకాడమీకి చెందిన ఉపాధ్యాయుడు కరన్ సంఘ్వాన్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చదువుకున్న నేతలకు మాత్రమే మీరంతా ఓట్లు వేయాలంటూ సంఘ్వాన్ తన విద్యార్థులను కోరాడు. అంతే కానీ నగరాల పేర్లు మార్చే నేతలకు ఓట్లు వేయకండని సూచించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతనిపై అన్ అకాడమీ యాజమాన్యం వేటు వేసింది.

అన్ అకాడమీ ప్రవర్తనా నియమావళిని సాంఘ్వన్ ఉల్లంఘించాడని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునేందుకు తరగతి గది వేదిక కాకూడదని ఆయన చెప్పారు. విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ సంస్థను ప్రాంభించామన్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చదువుకున్న వారికి ఓటు వేయాలని కోరడం నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నిరక్షరాస్యులను తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానన్నారు. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదన్నారు. ఇది శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న కాలమన్నారు. ఇలాంటి యుగంలో నిరక్షరాస్యుడైన ప్రజాప్రతినిధులు ఆధునిక భారతదేశాన్నినిర్మించలేరన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు