Hyderabad Laad Bazar Bangles : హైదరాబాద్ లాడ్‌బజార్ లక్క గాజులకు జీఐ ట్యాగ్..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా? హైదరాబాద్ మహానగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన లాడ్ బజార్ లక్కగాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు ముగింపు లభించింది. By Bhoomi 03 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి IG Tag for Hyderabad Laad Bazar Bangles: హైదరాబాద్ మహానగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన లాడ్ బజార్ లక్కగాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు ముగింపు లభించింది. ట్యాగ్ కోసం 2022జూన్ లో హైదరాబాద్ క్రెసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిసన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ జీఐ ట్యాగ్ ను శనివారం ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్ హలీమ్ కు (Hyderabad Haleem) జీఐ ట్యాగ్ లభించిన సంగతి తెలిసిందే ఇప్పుడు జీఐ ట్యాగ్ (GI Tag) అందుకున్న 17వ ప్రొడక్టుగా లక్కగాజులు నిలిచాయి. లక్కగాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ జీఐ ట్యాగ్ ను శనివారం ప్రకటించింది. వాస్తవానికి హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం లక్కగాజులకు ఎంతో ఫేమస్. లాడ్ బజార్ లోని ప్రసిద్ద లాక్ బ్యాంగిల్స్ ను లక్కగాజులుగా పిలుస్తారు. హైదరాబాద్ లక్క గాజులకు స్థానికంగా, అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీని వెనుక ఈ ప్రాంతంలోని హస్తకళాకారుల నైపుణ్యం, క్రియేటివిటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే. లక్కగాజుల తయారీలో రెసిన్ ను కొలిమిపై కరిగిస్తే లక్కగా మారుతుంది. దీన్ని గుండ్రంగా మలిచి, స్పటికలు, రాళ్లు, పూసలు, అద్దాలను అమర్చి చేతులతోనే అందంగా గాజులపై అమరుస్తారు. అయితే ఈ కథ 350 నుంచి 400ఏండ్ల క్రితం మొఘల్ కాలంలో ఉద్భవించిందని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి: ఈ లక్క గాజులు ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయో..వాటిని మొదట ఎవరు రూపొందించారన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితు కుతుబ్ షాహీ కాలం చివరిలో ఈ గాజులు తయారు చేశారని చెబుతుంటారు. రాజకుటుంబాల్లోని మహిళలు ఎక్కువగా ఈ లక్క గాజులు ధరించేవారట. అయితేగోల్కోండ రాజ్యం వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. దీంతో లక్క గాజులను మొదటిసారిగా తయారు చేసినప్పుడు అవి స్వచ్చమైన వజ్రాలతో నిండి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. కాలక్రమేణ వజ్రాల స్థానంలో అలంకార రాళ్లు వచ్చి ఉంటాయని పరిశోధనలు భావిస్తున్నారు. కుతుబ్ షాహీకాలంలో ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన కొంతమంది యునానీ హకీమ్ లు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ..పార్ట్ టైం జాబ్ గా బ్యాంగిల్స్ ను తయారు చేశారని..వారి నుంచే లక్క గాజులు తయారీ ప్రారంభం అయ్యిందన్న వాదన కూడా ఉంది. మరోవైపు హైదరాబాద్ లో స్థిరపడిన విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిన చేతివ్రుత్తుల వారు దీనికి కారణమన్న మరో వాదన కూడా ఉంది. అయితే లక్కగాజులు ఎలా ఉద్బవించాయన్న సంగతి పక్కన పెడితే..హైదరాబాద్ కల్చర్, సంప్రదాయంలో లక్కగాజులు ప్రత్యేకమైన గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా…కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.! #gi-tag #laad-bazaar-lac-bangles-gi-tag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి