Equal Votes: ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే విజేతను నిర్ణయించడానికి కాయిన్ టాస్ వేస్తారు. దాని ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎన్నికల కమిషన్ ఇలా చేస్తుంది. By KVD Varma 01 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Equal Votes: డిసెంబర్ 3న దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిన సందర్భాలున్నాయి. ఓట్ల లెక్కింపులో ఒక స్థానంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే విజేత ఎవరో ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియదు. అయితే, ఎన్నికల కమిషన్ తన నిబంధనల్లో ఈ సమస్యకు పరిష్కారం చెప్పింది. ఒక స్థానంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు(Equal Votes) వచ్చినప్పుడు వారి భవితవ్యాన్ని నిర్ణయించే ఒక విధానం ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. మరి అలా ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? విజేతగా ఎవరు నిలుస్తారో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఏ ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు(Equal Votes) వస్తే లాటరీ నిర్వహిస్తుంది. ఎవరికి అనుకూలంగా లాటరీ వస్తుందో ఆ అభ్యర్థికి దానిని అదనపు ఓటుగా పరిగణిస్తారు. ఈ విధంగా లాటరీ గెలిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఎక్కడైనా ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు(Equal Votes) వస్తే ఏమవుతుందనే ప్రశ్న కూడా మీకు వచ్చే ఉంటుంది కదా. అయితే, ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వస్తే టాస్ వేసి విజేతను నిర్ణయించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. కానీ ముగ్గురు అభ్యర్థులు సమాన సంఖ్యలో ఓట్లు సాధిస్తే ఏమి చేయాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. ఇప్పటివరకూ ఇటువంటి పరిస్థితి వచ్చిన సందర్భం ఏదీ వెలుగులోకి రాలేదు. కానీ, ఇలా జరగకూడదనీ లేదు కదా? అయితే, ఇలా జరిగితే మాత్రం ఏమి చేయాలనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి రాజ్యాంగ నియమము లేదు. Also Read: గెలుపు సర్టిఫికేట్ తీసుకోగానే ఎమ్మెల్యేలు కర్ణాటకకు.. బెంగళూరులో కాంగ్రెస్ క్యాంప్? గతంలో.. ఇప్పటివరకు ఒకే సీటులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2017 డిసెంబర్లో మథుర-బృందావన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీరా అగర్వాల్ 56వ వార్డు నుంచి పోటీ చేశారు. ఆయనకు 874 ఓట్లు వచ్చాయి. అంతే సంఖ్యలో ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి కూడా వచ్చాయి. అప్పుడు టాస్ ద్వారా బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. 2017 ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అతుల్ షా, శివసేన అభ్యర్థి సురేంద్ర మధ్య గట్టి పోటీ నెలకొంది. వాస్తవానికి తొలి కౌంటింగ్ తర్వాత వచ్చిన ఫలితాల్లో అతుల్ షా ఓటమి పాలయ్యారని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపును సవాలు చేస్తూ మళ్లీ ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పరిస్థితి ఉంది. ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడా తలెత్తకపోవడంతో మళ్లీ కౌంటింగ్ నిర్వహించగా ఈసారి కూడా ఇద్దరి మధ్య సమపోటీ నెలకొంది. అనంతరం లాటరీ ద్వారా అతుల్ షాను విజేతగా ప్రకటించారు. ఈ విధంగా, ఇటువంటి సందర్భాల్లో, లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏదైనా వ్యత్యాసం ఉందని అభ్యర్థి భావిస్తే, అతను రీ కౌంటింగ్ కోరవచ్చు. కానీ అలా చేసేటప్పుడు, అతను దానికి సరైన కారణాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. Watch this interesting Video: #election-results #election-counting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి