నన్ను మూడు రోజులుగా గృహ నిర్బంధంలో పెట్టారు.. కేసీఆర్ పై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సస్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మూడు రోజుల నుంచి గృహనిర్బంధంలో పెట్టినట్టు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై తాను ఈడీ ఇంకా సీబీఐకి కంప్లైంట్ చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు. వంద కోట్లు పలికిన ఎకరం భూమి.. పక్కన ఆనుకొని ఉన్న 40 వేల ఎకరాల కల్వకుంట్ల బినామీ భూముల విలువ పెంచడానికే ముఖ్యమంత్రి మాయ చేస్తున్నారన్న బక్క జడ్సన్..

New Update
నన్ను మూడు రోజులుగా గృహ నిర్బంధంలో పెట్టారు.. కేసీఆర్ పై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సస్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మూడు రోజుల నుంచి గృహనిర్బంధంలో పెట్టినట్టు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై తాను ఈడీ ఇంకా సీబీఐకి కంప్లైంట్ చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు. దీనికంటే ముందు ఆయన రంగారెడ్డి జిల్లా కోకాపేట నియో పోలీస్ భూములను పరిశీలించారు.

ప్లాట్ నెం 10.. 100.75 కోట్లకు అమ్ముడుపోతే.. మిగతా 450 ఎకరాలకు కూడా 100 కోట్లకు అమ్మాలి కదా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా, ఆయన కోకా పేట్ భూములు వందల కోట్లకు అమ్ముడు పోవడం పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వంద కోట్లు పలికిన ఎకరం భూమి.. పక్కన ఆనుకొని ఉన్న 40 వేల ఎకరాల కల్వకుంట్ల బినామీ భూముల విలువ పెంచడానికే ముఖ్యమంత్రి మాయ చేస్తున్నారని బక్క జడ్సన్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలోని కోకాపేట్ 10 ప్లాట్లను ఆయన పరిశీలించారు.

కాగా,గురువారం వేసిన వేలంపాటతో ఏకంగా ఎకరం భూమి వంద కోట్లు పలికి అందరికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో భూములకు ఎంత విలువ ఉందో ఈ వేలం పాటతో మరోసారి బహిర్గతం చేసింది. కేవలం 45.33 ఎకరాలు వేలం వేయగా తెలంగాణ సర్కార్ ఖజానాకు 3 వేల 319 కోట్లకు పైగా ఆదాయం చేరింది. మార్నింగ్ సెషన్ లో 6,7,8,9 ఫ్లాట్లకు ఆక్షన్ నిర్వహించగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎగబడి మరీ కొనేశాయి. దీంతో ఎకరం 68 కోట్లకు తగ్గకుండా అమ్ముడు పోయింది.

ఇక నియోపోలీస్ లేఅవుట్ లో ఎకరానికి ఏకంగా 100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండీఏ ఇదే లేఅవుట్ లో ఇంతకు ముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా 60 కోట్లు రేటు పలకగా... గురువారం నాటి రెండో దశ దాన్ని మించిపోయింది.అయితే హెచ్ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి 35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. అయితే సగటున ఎకరానికి 73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు