Priyanka Gandhi Vadra: రాహుల్ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న.. ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండాలని ఒక సోదరిగా తాను కోరుకుంటున్నాని అన్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ కు మద్దతుగా రాయ్‌బరేలీలో ప్రచారం చేస్తున్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ

Priyanka Gandhi Vadra: లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి మద్దతుగా రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం… బీఆర్ఎస్ లోకి విజయశాంతి?

ఆమె మాట్లాడుతూ.. “ఒక సోదరిగా, నా సోదరుడు సంతోషకరమైన వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతను వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని నేను కోరుకుంటున్నాను" అని అన్నారు. కాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె జవాబు ఇస్తూ.. మోదీని, బీజేపీ గద్దె దించేందుకు ఇండియా కూటమి పని చేస్తుందని.. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని కూటమి నేతలే ఎన్నుకున్నారని ఆమె జవాబు ఇచ్చారు.

“మేమిద్దరం (ప్రియాంక, రాహుల్) దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం…నేను 15 రోజులు రాయ్‌బరేలీలో ఉన్నాను మీరు చూడవచ్చు. రిమోట్‌ కంట్రోల్‌తో ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాలు కావు కాబట్టి ఎవరైనా ఇక్కడ (అమేథీ, రాయ్‌బరేలీ) ఉండాలి. మేము ఇక్కడ కష్టపడి పనిచేశాం...ఈ నియోజకవర్గాల ప్రజలతో మాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి. మేము చుట్టూ ఉండాలని వారు ఆశిస్తున్నారు. మేమిద్దరం పోరాడి ఉంటే, మేము మా నియోజకవర్గాలను నిర్వహించేవాళ్లం, ”అని ప్రియాంకగాంధీ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు