Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా!

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కంగనా స్పందించారు. నేను గర్వించ దగ్గ హిందువునని..నేను ఏంటో నా ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.

New Update
Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా!

 హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ కంగనా పేరు తీసుకోకుండా ఆమెను టార్గెట్ చేయడంతో ఇప్పుడు కంగనా రనౌత్ స్పందించింది. నేను బీఫ్, మరే ఇతర రెడ్ మీట్ తినను. నాపై నిరాధారమైన పుకార్లు ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా యోగిక్ ఆయుర్వేదానికి మద్దతునిస్తు ప్రచారం చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపవు. నేను ఒక గర్వించదగ్గ హిందువునని  నా ప్రజలకు తెలుసు. వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరని కంగానా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సుఖు ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఈ విషయంపై కంగనా  పై పరోక్షం గా వ్యాఖ్యలు చేశారు. “హిమాచల్  దేవతల పవిత్ర ప్రదేశం. అది దేవభూమి. గోమాంసం తినే వారు ఇక్కడ, ఇక్కడ అనర్హులు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలంటే చాలా పవిత్రతో ఉండే వారు మాత్రమే చేయాలని వారు అన్నారు.

మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ తరపున విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దింపడం గమనార్హం. విక్రమాదిత్య సింగోలి నుంచి .తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ మండి లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు.

టికెట్ లభించిన తర్వాత, కంగనా రనౌత్ మండి జిల్లాలో ఆరు రోజుల పాటు ప్రచారం చేసి, ఆ తర్వాత కొన్ని రోజులు ముంబైకి వెళ్ళింది. కంగనా ఆ తర్వాత భంభ్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. దీని తర్వాత ఆమె మండి నగరం, కర్సోగ్, డ్రాంగ్, సుందర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు ఐదు రోజుల తర్వాత కంగనా ముంబై నుంచి మండికి తిరిగి రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు