Hydra effect: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చెరువులను ఆక్రమించిన వారిని టెన్షన్ లో పడేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని సీఎం వ్యూహంగా కనిపిస్తోంది. హైడ్రా ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించి ప్రజల మెప్పు పొందవచ్చని రేవంత్ చెబుతున్నారు. 

New Update
BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!

Hydra effect:  తెలంగాణాలో ఇప్పుడు అతిపెద్ద చర్చ హైడ్రా. నాలాలు.. చెరువులు.. ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలతో దందాలు చేస్తున్నవారికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది హైడ్రా. హైదరాబాద్ లో చెరువుల బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను ఒక్కోటిగా కూలుస్తూ వస్తున్నారు హైడ్రా అధికారులు. నోటీసు ఇవ్వడం.. దానికి సమాధానం ఇవ్వని వ్యక్తుల ప్రాపర్టీస్ నేల మట్టం చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేశారు. ఇది సంచలనంగా మారింది. హైదరాబాద్ లో దాదాపుగా 60 శాతానికి పైగా చెరువులు కబ్జాలకు గురయ్యాయని హైడ్రా అంచనా వేసింది. ఈ మేరకు చెరువులలో ఆక్రమణలు తొలగించాలని గట్టిగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే చాలా వరకూ చెరువుల ఆక్రమణలపై నోటీసులు ఇచ్చింది హైడ్రా. నోటీసులకు స్పందించని వారి కట్టడాలపై బుల్డోజర్ తో విరుచుకుపడి వాటిని నేల మట్టం చేస్తున్నారు అధికారులు. 

Hydra effect:  హైడ్రా కు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తూ.. దానికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, నాలాల ఆక్రమణపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. బఫర్ జోన్ లో నిర్మించిన ఎటువటిని కట్టడమైన.. ఎవరి నాటి అయినా కూల్చివేయాలని సూచిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాజకీయంగా హైడ్రా వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ హైడ్రా రాజకీయ డ్రామాగా చెబుతోంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికే హైడ్రా పేరుతో హంగామా చేస్తున్నారని విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అతి పెద్ద టాపిక్ గా మారిపోయింది. 

Hydra effect:  ఇదిలా ఉండగా.. హైడ్రాను తెరమీదకు తీసుకువచ్చింది జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికే అనే ఒక చర్చ సర్వత్రా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపించింది. అధికారానికి వచ్చింది. కానీ, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. జీహెచ్ఎంసిసీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. దీంతో ఇక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారు కూడా. అయినా.. కాంగ్రెస్ కు ప్రజల్లో పట్టు పెరగలేదనే భావన నెలకొంది. అందుకే హైడ్రా ఏర్పాటు.. దాని ద్వారా ముందుగా హైదరాబాద్ లోని చెరువులు, నాలాలను సరి చేసే పని చేపట్టిందని చెప్పుకుంటున్నారు. హైడ్రా ద్వారా తామనుకున్నట్టు కనీసం సగం చెరువులు, నాలాలను రక్షించినా.. ప్రజలు కాంగ్రెస్ కు జై కొడతారని ఆ పార్టీ పెద్దలు కూడా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. 

హైడ్రా వ్యవహారంపై హైదరాబాద్ లో ప్రజలు పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. చాలా చోట్ల నాలాల ఆక్రమణపై హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన ప్రతి చోట వాటిని పరిశీలించి.. ఆక్రమణలు నిజమైతే.. వాటిని స్వచ్ఛందంగా తొలగించమని ఆదేశిస్తూ నోటీసులు జరీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించని వారి కట్టడాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్టడం అయితే వెంటనే తొలగించేస్తున్నారు. దీంతో ప్రజల్లో హైడ్రా పై ప్రశంసాపూర్వక వాతావరణం ఏర్పడింది. ఇది తమకు జీఎచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడవచ్చని కాంగ్రెస్ పార్టీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నమ్ముతున్నారని చెప్పుకుంటున్నారు. చినుకు పడితే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి నగరంలో ప్రస్తుతం నెలకొని ఉంది. చెరువుల కబ్జా.. నాలాల అక్రమణతో ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే, ఆ ఆకర్మణాలను నిష్కర్షగా నేలమట్టం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు అభినందిస్తున్నారు. హైడ్రాకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో హైడ్రా చర్యలపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి హైడ్రా జపం చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే, రాజకీయం కోసం చేసినా.. ఎన్నికల కోసం చేసినా ప్రజలకు మంచి జరుగుతున్నపుడు అనవసరమైన రాద్ధాంతం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

Hydra effect: మొత్తమ్మీద చూసుకుంటే హైడ్రా ను ముందు పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం అవుతున్నట్టే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట. రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు