Reverse Typing : రివర్స్ లో టైపింగ్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డు సృష్టించిన హైదరాబాదీ.. హైదరాబాద్ కు చెందిన అష్రాఫ్ కేవలం 2.88 సెకన్లలోనే 26 ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ను వెనక నుంచి ముందుకు టైప్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు.వివరాల్లోకి వెళ్తే.. By Durga Rao 05 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి World Guinness Record : హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఓ లాయర్(Lawyer) సాధించిన అసాధారణ ఘనత నెటిజన్లను అవాక్కు చేస్తోంది. అతనికి ఏకంగా గిన్నిస్ రికార్డు తెచ్చి పెట్టింది. హైదరాబాదీ అయిన అష్రాఫ్ కీబోర్డ్ టైపింగ్(Keyboard Typing) లో దిట్ట. తన టైపింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నాడు. అందులోనూ వెరైటీ కోరుకున్నాడు. వెంటనే కీబోర్డ్ ను రఫ్పాడించాడు. ఇంతకీ అతను ఏం టైప్ చేశాడో.. ఎంత వేగంగా టైప్ కొట్టాడో చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే కేవలం 2.88 సెకన్లలోనే అష్రాఫ్ 26 ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ను వెనక నుంచి ముందుకు టైప్ చేశాడు. అంటే జెడ్ నుంచి ఏ దాకా అన్నమాట. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇన్ స్టా గ్రామ్(Instagram) లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అష్రాఫ్ టైపింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి స్టాప్ క్లాక్ ను ఆన్ చేయడం కనిపిస్తుంది. అతను టైపింగ్ ఆపగానే స్టాప్ క్లాక్ ను ఆ వ్యక్తి ఆపేశాడు. అందులో సరిగ్గా 2.88 సెకన్లు చూపించింది. దాన్ని చూసిన ఆ వ్యక్తి ఇంత స్పీడ్ గా ఎలా టైప్ చేశావ్ అన్నట్లుగా మొహంలో ఎక్స్ ప్రెషన్ పెట్టడం కూడా కనిపించింది. అష్రాఫ్ కు రికార్డులు కొత్తేం కాదు. ‘ఫాస్టెట్ టైమ్ టు టైప్ యాన్ ఆల్ఫాబెట్’ అనే రికార్డు గతంలోనే అతని పేరిట నమోదైంది. ఈ వీడియోను షేర్ చేయగానే కేవలం ఇన్ స్టా గ్రామ్ లోనే దానికి ఏకంగా 10 లక్షల వ్యూస్ లభించాయి. అలాగే 40 వేల లైక్ లు వచ్చాయి. అష్రాఫ్ టాలెంట్ దేశానికే గర్వకారణమని నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. Also Read : మంత్రి పీఎస్ ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం! #guinness-world-record #alphabet-typing #backwards #hyderabad-man మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి