MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే? హైదరాబాద్ నగర వాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో అతి త్వరలో 4 ఎంఎంటీఎస్ ను పరుగులు పెట్టించనున్నట్లు వెల్లడించింది. By Bhavana 07 Oct 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ నగర వాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో అతి త్వరలో 4 ఎంఎంటీఎస్ ను పరుగులు పెట్టించనున్నట్లు వెల్లడించింది. ఎంఎంటీఎస్ లోకల్ రైల్ సర్వీసులను మేడ్చల్- లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడుస్తున్న వందే భారత్ రైళ్లకు అనుగుణంగా ఉండేందుకు ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రకటించింది. దానికి సంబంధించిన సమయాలను ఎస్సీఆర్ విడుదల చేసింది. అందుకోసం సికింద్రాబాద్ - ఉమ్‌దానగర్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. Also read: శీతాకాలం వచ్చేసింది…చిన్నారులు జర భద్రం! డైలీ మేడ్చల్ లో ఉదయం 7.20 , మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంఎంటీఎస్ సేవలు ఉంటాయి. ఇదిలా ఉండగా లింగం పల్లి నుంచి ఉదయం 10.20 , సాయంత్రం 6.10 గంటలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆదివారం మాత్రం సర్వీసులు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్- హైదరాబాద్ కు సర్వీసు ఉదయం 11.50 కి మేడ్చల్ లో స్టార్ట్ అవుతుంది. తిరిగి మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి మొదలవుతుంది. కొత్తగా ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్ సేవలు విద్యార్థులు, ప్రయాణీకులు, చిన్న వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. #mmts #south-centra-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి