Madhavi Latha: హైదరాబాద్‌ పోలీసులకు మాధవీలత మాస్‌వార్నింగ్‌

TG: పోలింగ్‌ రోజు ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తే విడిచి పెట్టొద్దని హైదరాబాద్ పోలీసులను కోరారు మాధవీలత. పోలీసులు ఎక్కడైనా ఎంఐఎంకు సపోర్ట్‌ చేస్తే బాగుండదని అన్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్‌ చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు.

New Update
Madhavi Latha: హైదరాబాద్‌ పోలీసులకు మాధవీలత మాస్‌వార్నింగ్‌

Madhavi Latha: హైదరాబాద్‌ పోలీసులకు మాధవీలత మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్‌ రోజు ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తే విడిచిపెట్టొద్దని కోరారు. పోలీసులు ఎక్కడైనా ఎంఐఎంకు సపోర్ట్‌ చేస్తే బాగుండదని అన్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్‌ చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. బురఖాల్లో చిన్నారులు, మగవారితో దొంగ ఓట్లకు ఎంఐఎం ప్లాన్‌ చేస్తోందని ఆరోపించారు. ఫేస్‌ ఐడెంటిటీ చేయకుండా అడ్డుకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పోలీసులు కాంప్రమైజ్‌ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం అని అన్నారు. ఎంఐఎంను పూర్తిగా బ్యాన్‌ చేసే వరకు పరిస్థితిని తీసుకెళ్తాం అని హెచ్చరించారు.

ALSO READ: బీజేపీ గెలుస్తే అమిత్ షానే ప్రధాని.. క్లారిటీ

అన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌..

ఇక మే 13న ఎన్నికలు ముగిసే వరకు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లు తనిఖీ చేయనున్నారు. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సైలెన్స్‌ పీరియడ్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి రాజకీయపరమైన సమావేశాలు, మెసెజ్ ల పంపకాలను ఎన్నికల సంఘం నిషేధించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment