AP: దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..!

ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

West Godavari:  ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త అతి కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. భార్య రాజనాల సాయి లక్ష్మి (28), భర్త రాజనాల సూర్య చంద్రం మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయని..ఈ రోజు ఉదయం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు.

Also Read: ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. వైద్యాధికారులపై ఆగ్రహం..!

సాయి లక్ష్మీ ఇంట్లోంచి బయటకు వస్తుండగా భర్త సూర్య చంద్రం వెనుక నుంచి కత్తితో మెడపై నరికాడని, కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో సాయిలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయిందన్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భర్త సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సాయి లక్ష్మీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisment
Advertisment
Advertisment