Vemulawada : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ!

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.

New Update
Vemulawada: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

Rajanna Temple : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) లో కొలువై ఉన్న రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం నెలరోజులు కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్తీక మాసం(Karthika Masam) ముగిసిన తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఈరోజు తెల్లవారు జామునుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు.

స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని ఆలయాధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్తీక మాసం ముగిసిన తరువాత ఈ సోమవారమే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని ఆలయాధికారులు వెల్లడించారు. ఇంత మంది వస్తారని ముందుగా ఊహించలేదని వారు పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

క్యూ లైన్లలో మంచినీరు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే క్యూ లైన్లు అన్ని నిండి పోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తుంది.

భక్తులకు వేగంగా దర్శనభాగ్యం కల్పించేందుకు ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు. పలువురు భక్తులు కోడె మొక్కులను తీర్చుకుంటున్నారు.

Also read: అనాథ ఆశ్రమంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు..పాల్గొన్న పవన్ కల్యాణ్ సతీమణి అనా కొనిదెల..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు