మీ ఓటు ఏ బూత్ లో ఉంది? పోలింగ్ స్టేషన్ ఎక్కడ?.. ఒక్క క్లిక్ తో తెలుసుకోండిలా! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. పోలింగ్ కేంద్రం వివరాలు తెలియని వారు https://electoralsearch.eci.gov.in/, https://www.ceotelangana.nic.in/ వెబ్ సైట్స్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. By Jyoshna Sappogula 30 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Assembly Election Polling: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే గ్రామ పంచాయితీ అధికారులు ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను అందజేశారు. అయితే, కొంతమంది మాత్రం వారికి పోలింగ్ స్లిప్ అందలేదని, పోలింగ్ కేంద్రం తెలియదని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అలాంటి వారు ఏ మాత్రం టెన్షన్ పడనవసరం లేదు. ఎందుకంటే.. అడ్రస్ మారడం వల్లో, లేదంటే ఇతర కారణాల వల్లో కొందరికి పోలీంగ్ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన ఓటు హక్కు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పోలీంగ్ వివరాలను తెలుసుకోవడానికి సోల్ ఫొన్ లో అనేక మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే..? Do you know your polling station? Telangana Assembly elections on 30th November 2023#CEO #CEOTelangana #ecispokesperson #ECISVEEP #TelanganaElections2023 #voteforsure @ECISVEEP @SpokespersonECI @PriyadarshiPN pic.twitter.com/tE8Pj7FedH — CEO Telangana (@CEO_Telangana) November 28, 2023 Also read: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి! * మీ ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను 1950, 92117 28082 నంబర్లకు పంపిస్తే మీ పోలింగ్ కేంద్రం వివరాలు SMS రూపంలో తెలుస్తుంది. * 24 గంటల పాటూ పనిచేసే టోల్ ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలీంగ్ కేంద్ర, బూత్ నంబర్, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకునే అవకాశం. *ఎన్నికల సంఘానికి చెందిన 'ఓటరు హెల్ప్ లైన్' యాప్ డౌన్ లోడ్ చేసుకుని తెలుసుకుని అవకాశం ఉంది. * ఎన్నికల సంఘం వెబ్ సైట్ www.ceotelangana.nic.in లేదా https://electoralsearch.eci.gov.in/ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. * https://www.ceotelangana.nic.in/ లోని Ask Voter Sahaya Mithra చాట్‌బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. * ఓటరు వివరాలు, EPIC నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా కూడా పోలీంగ్ కేంద్రం వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంది. #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి