Manipur : మణిపూర్‎లో దారుణ ఘటన..నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం..!!

మణిపూర్ లో (Manipur) దారుణం చోటుచేసుకుంది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలపై సామాహిక అత్యచారానికి పాల్పడ్డారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది.

New Update
Manipur : మణిపూర్‎లో దారుణ ఘటన..నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం..!!

ఇది మానవాళికి అవమానకరమైన ఘటన. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా...మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట మహిళ అవమానానికి గురవుతూనే ఉంది. తాజాగా మణిపూర్ లో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. గత కొన్నాళ్లుగా మణిపూర్ లో కొనసాగుతున్న హింసకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పట్టపగలే కీచక పర్వం కొనసాగింది. కుకీ జాతికి చెందిన ముగ్గురు గిరిజన యువతులను నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని హత్య చేసిన ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

publive-image

ఈ దారుణ ఘటన మే 4 జరిగింది. బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు బాధితులను దుండగులు హతమార్చినట్లు పోలీసుల FIRస్పష్టం చేస్తోంది. మైతేయిలు, కుకీల మధ్య గత కొన్నాళ్లుగా హింస చోటుచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పలుదారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటన మే 3వ తేదీ తర్వాత జరిగిందని ఇండిజినల్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ITLF)ఆరోపించింది. బాధిత మహిళలు కుీ జో. తెగకు చెందినవారుగా (ITLF) తెలిపింది. కాగా ఈ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ స్పందించాయి. విచారణకు కోరాయి.

కేసు నమోదు:
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మే 4వ తేదీకి సంబంధించిన వీడియోగా గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. దుండుగులు కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య వంటి కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా నిందుతులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా ఈ ఘటనపై రాజకీయాలు ఊపందుకున్నాయి. భారతావనిపై దాడి జరగుతుందంటూ ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. మణిపూర్ ప్రజలకు మేము అండగా ఉంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ మౌనం మణిపూర్ ను హింసవైపు నెట్టిందనం మండిడపడ్డారు.

ఈ ఘటనపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఐటీ సెల్ ఇంచార్జీ అమిత్ మాల్వియా కూడా సున్నితమైన ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రెస్ నోట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు