Home Guard Ravinder: మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రవీందర్‌!

జీతాలు సరిగా రాక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు.

New Update
Home Guard Ravinder: మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రవీందర్‌!

Home Guard Ravinder Passed Away: జీతాలు సరిగా రాక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. అపోలో ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్‌. హోంగార్డు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

గోషామహల్‌ హోం గార్డు ఆఫీసులో ఆదివారం ఉదయం జీతాలు సరిగా ఇవ్వట్లేదని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న రవీందర్‌. శరీరం సుమారు 70 శాతం కాలిపోవడంతో చికిత్స కోసం అపోలో డీఆర్‌డీఓ కి తరలించారు. అయితే కీడ్నీ, లివర్‌ అన్ని కూడా కాలిపోయి పరిస్థితి విషమంగా మారింది.

చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 6 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల ముఖ్య కారణాలను రవీందర్‌ ఓ వీడియోలో వివరించాడు. రవీందర్‌ చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమో అనే ఉద్దేశంతో ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: కాసేపట్లో పెళ్లి..ఈలోపే చెట్టుకు వేలాడుతూ..

Advertisment
Advertisment
తాజా కథనాలు