/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/JANASENA-TDP.jpg)
Janasena: కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు జనసేన కార్యకర్తలు. జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారని నిరసనకు దిగారు. నాగవరప్పాడు వంతెన దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. జనసేన దిమ్మెను టీడీపీకి చెందిన బీసీ నేత దారం నరసింహారావు ధ్వంసం చేశాడు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు నరసింహారావు.
కూటమి గెలిచాక నరసింహారావు మరింత యాక్టివ్ అయ్యాడు. నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా దారం నరసింహారావు ఉన్నాడు. పార్టీ దిమ్మెను ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు పార్టీ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్. కాగా దీనిపై ఇంకా గొడవ కొనసాగుతోంది. అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read : ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి!