Danam Disqualification: అనర్హత వేటు పిటిషన్..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.! ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన కోర్టు స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎమ్మెల్యే దానంలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 25కు వాయిదా వేసింది. By Bhoomi 15 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Danam Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పటిషన్ పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, స్పీకర్ , శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం, తర్వాత కాంగ్రెస్ లో చేరారని..ఆయన్ను అనర్హుడిగా ప్రటించాలంటూ శాసన సభాపతికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ ను విచారణ చేపట్టారు.దానంను సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందని ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇదే నిదర్శమని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సంతోష్ కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారినా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని.. స్పీకర్ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి... ఈ మేరకు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..! #danam-disqualification #daanam-nagendhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి