బీజేపీ మహాధర్నాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..పోలీసులకు మొట్టికాయలు! By P. Sonika Chandra 24 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. కాగా, మహాధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో టీబీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం ధర్మాసనం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది.అయితే ఈ ధర్నాకు పర్మిషన్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రం ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గలేదా.. అని న్యాయస్థానం ప్రశ్నించింది. 5 వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని నిలదీసింది. దీంతో రేపటి బీజేపీ మహాధర్నాకు 500 మంది మాత్రమే పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని కండిషన్స్ హైకోర్టు పెట్టింది.అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వేరే కారణాలు చూపుతూ ఎందుకు ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించింది ధర్మాసనం. అయితే వెయ్యి మంది వస్తారని, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అప్పుడు వెయ్యి మందికే భద్రత ఇవ్వకుంటే కోటి మందిని ఎలా కాపాడుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు నిలదీసింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి