గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్

గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు.దీంతో ఇరువురు హైకోర్టును ఆశ్రయించగా..కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది.

New Update
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్
Governor's quota MLCs issues: గవర్నర్ కోటా  ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బిఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ తిరస్కరించారు. దీంతో  దాసోజు శ్రవణ్ కుమార్ , కుర్రా  సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.తమ కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు నిలిపివేస్తూ .. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు  అంటే ఫిబ్రవరి  8వ తేదీ వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది.

ALSO READ:కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు

జనవరి 31 న జరగనున్న కొత్త  ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వాయిదా 
కాంగ్రెస్గ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్​లను  నియమించాలని కాంగ్రెస్ సర్కార్  గవర్నర్​కు  సిఫారసు చేసింది. ఈ సిఫారసును  గవర్నర్ ఆమోదం తెలుపుతూ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో సోమవారం కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ లు  ఎమ్మెల్సీలు  ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా , ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ ఆరోగ్యం బాగోలేక ఈ నెల 25 నుంచి అందుబాటులో లేరు. ఈ నెల 31వ తేదీన కొత్తగా ఎంపికైన  ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకుంటామని సుఖేందర్ పేర్కొన్నారు. ఈ లోపే హైకోర్టులో విచారణ జరిగి ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయమనడంతో  రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బిఆర్ఎస్ ప్రభుత్వ సిఫార్సుని తిరస్కరించిన గవర్నర్ 

2023 జులై 31న శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గత ప్రభుత్వం గవర్నర్​కు సిఫారసు చేసింది. అయితే  సెప్టెంబర్ 25న ఈ ఇద్దరిని  ఆమె తిరస్కరించారు. ఆమె నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్‌ కుమార్ , సత్యనారాయణ హైకోర్టులో ఫిటిషన్​ వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌ను, మీర్ అమీరుల్లాఖాన్‌ను ఎంపిక చేసింది. ఈ సిఫారసును  గవర్నర్ ఆమోదించడం .. ప్రమాణస్వీకారానికి సిద్దమయ్యే క్రమంలో  ఇరువురి ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది.

ALSO READ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు

Advertisment
Advertisment
తాజా కథనాలు