ధాన్యం లారీకి నిప్పు పెట్టిన మావోయిస్టులు.. ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్

ఎన్నికలను బహిష్కరిస్తూ మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ విధించారు. ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టులు ఓ ధాన్యం లారీకి నిప్పుపెట్టడం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
ధాన్యం లారీకి నిప్పు పెట్టిన మావోయిస్టులు.. ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలను బహిష్కరిస్తూ మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ విధించారు. ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టులు ఓ ధాన్యం లారీకి నిప్పుపెట్టడం కలకలం రేపింది. గట్టి భద్రత చర్యలు చేపట్టినప్పటికీ మావోయిస్టులు లారీకి నిప్పంటించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు జిల్లా అంతటా భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగనీయబోమని, ప్రజలు నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల వేళ ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించినా, ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగకుండా ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు మొదలయ్యాయి

ఎన్నికలకు భారీగా బందోబస్తు:
తెలంగాణ ఎన్నికల కోసం పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేసినట్లు సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. 45 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు, మూడు వేల మంది ఇతర శాఖల సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. కర్ణాటక నుంచి ఐదు వేలు, మహారాష్ట్ర నుంచి ఐదు వేలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500, మధ్యప్రదేశ్ నుంచి 2,000, ఒడిశా నుంచి 2,000 మంది హోంగార్డులను ఎన్నికల బందోబస్తులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు