Extra Ordinary Man: 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' షూట్ లో నితిన్, శ్రీలీల స్టెప్పులు.. డాన్స్ వీడియో వైరల్..!

హీరో నితిన్, శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇటీవలే విడుదలైన 'డేంజర్ పిల్ల' సాంగ్ 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా నితిన్ ఈ సినిమాలోని షూటింగ్ వీడియో పోస్ట్ చేస్తూ.. గెట్ రెడీ ఫర్ మాసివ్ ట్రీట్ అని ట్వీట్ చేశారు.

New Update
Extra Ordinary Man: 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'  షూట్ లో నితిన్, శ్రీలీల స్టెప్పులు..  డాన్స్ వీడియో వైరల్..!

Extra Ordinary Man: హీరో నితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నితిన్ సరసన నటించింది. మంచి ఎంటర్ టైన్మెంట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూవీ టీమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నితిన్ నటిస్తున్న ఈ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాన్ని డిసెంబర్ 8 న ప్రపంచ వ్యాప్తంగా విడుదుల చేస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే నితిన్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

publive-image

Also Read: Suma Kanakala’s: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్..!

ఇప్పటికే ఈ సినిమాలోని 'డేంజర్ పిల్ల' పాట యు ట్యూబ్ లో 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. లేటెస్ట్ గా విడుదల చేసిన 'బ్రష్ వేసుకో' లిరికల్ సాంగ్ రీలీజ్ చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హరీష్ జయరాజ్ వ్యవహరించారు. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక తాజాగా హీరో నితిన్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. శ్రీలీల, నితిన్ కలిసి డాన్స్ వేస్తున్న షూటింగ్ వీడియోను పోస్ట్ చేస్తూ.. గెట్ రెడీ ఫర్ మాసివ్ ట్రీట్ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నితిన్ ఫ్యాన్స్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

Also Read: Kanguva Movie: చరిత్ర సృష్టించిన హీరో సూర్య.. 38 భాషల్లో విడుదల..!

Advertisment
Advertisment
తాజా కథనాలు