అక్కినేని ఇంట తీవ్ర విషాదం..హీరో నాగార్జున సోదరి మృతి..!! అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె నాగ సరోజ అనారోగ్యంతో మరణించింది. నాగేశ్వరావు కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు, ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి కొంత కాలం కిందటే మరణించింది. ఇప్పుడు రెండో కూతురు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. By Jyoshna Sappogula 18 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Nagarjuna Sisiter Naga Saroja Passed Away: అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె నాగ సరోజ అనారోగ్యంతో మరణించింది. నాగేశ్వరావు కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు, ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి కొంత కాలం కిందటే మరణించింది. ఇప్పుడు రెండో కూతురు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Also Read: Sreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు నాగ సరోజ తండ్రి నాగేశ్వరావు పెద్ద హీరో అయినప్పటికీ, సినిమా ఇండస్ట్రీకి ఆమె ఎప్పుడు దూరంగానే ఉంది. సినిమా రిలీజ్ ఫంక్షన్స్ లో కానీ, ఇంకెక్కడా ఆమె కనిపించలేదు. ఇప్పటివరకు చాలామందికి ఆమె పేరు కూడా తెలియదు. ఒక పెద్ద హీరో కూతురు అయినప్పటికీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసింది . ఒక గృహిణి గానే తన కెరీర్ ను కొనసాగించింది. చివరి వరకు అలానే ఉండిపోయింది. నాగేశ్వర్ రావ్ మిగిలిన నలుగురు పిల్లలు అందరి చేత గుర్తింపు పొందారు. కానీ నాగ సరోజ మాత్రం ఎటువంటి గుర్తింపు పొందలేదు. ఇక ఇప్పుడు ఆమె మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నాగ సరోజ మరణం పట్ల పలువురు సెలబ్రెటీలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువలేని కథానాయకుడు అక్కినేని నాగేశ్వర రావు. తెలుగు సినిమా దిశ, దశ మార్చిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. రిసెంట్ గా ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అక్కినేని కుటుంబం ఘనంగా జరిపింది. అన్నపూర్ణ స్టూడియోలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. Also Read: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్..!! #akkineni-nagarjuna #naga-saroja #naga-saroja-passed-away మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి