Jagan: మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత! AP: పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు జగన్. నిన్న జగన్‌ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఈరోజు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. By V.J Reddy 23 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Jagan Pulivendula Tour: పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తొలి సారి పులివెందులకు వచ్చారు. పులివెందుల వేదికగా జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. రెండోరోజు కడప (Kadapa) నేతలతో జగన్ సమావేశమయ్యారు. భయపడొద్దు, ధైర్యంగా పోరాడండి.. నేనున్నా అంటూ భరోసా వారికి ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలతో చర్చించారు. గెలుస్తామనే స్థానాల్లో ఓటమిపై నేతలతో అధ్యయనం చేయనున్నారు. ఓవైపు నేతలతో సమీక్ష.. మరోవైపు ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ సమస్యలు వింటున్నారు. పిల్లాపాపలతో వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు పులివెందుల జనం. జగన్‌ను చూసేందుకు భారీగా క్యాంపు కార్యాలయానికి (Camp Office) ప్రజలు చేరుకుంటున్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న జగన్ ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. ముఖ్య నేతలు మాత్రమే జగన్ను కలిసేందుకు అనుమతిస్తున్నారు. Also Read: మాజీ సీఎం జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్ #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి