Rains In Telangana: ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో అతిభారీ వర్షాలు

వాతావరణ శాఖ తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Heavy Rains In Telangana: ఈనెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఆవరించిన ఉపరితల ద్రోణి.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించింది.

ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో చురుగ్గా నైరుతీ రుతుపవనాలు.. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు