/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Heat-Waves-jpg.webp)
Heat Waves: ఇంటినుంచి అడుగు బయటపెట్టాలంటే భయంగా ఉంటోంది. కానీ..వినీ ఎరగని వేడి. భానుడు రాత్రి విశ్రాంతి తీసుకున్నా.. ఆయన పగలు విడిచి వెళ్లిన వేడి తరంగాలు రాత్రుళ్ళు ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రోహిణి కార్తె వస్తే రోళ్ళు బద్దలు అవుతాయని అంటారు. కానీ.. అంతకు నెల రోజుల ముందు నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. కనీసం సాయంత్ర సమయాల్లోనైనా ఆరుబయట హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. సాయంత్రం ఏడు గంటలకు కూడా వేడి వాతావరణం(Heat Waves) అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. అంతేకాకుండా, పెరుగుతున్న ఉష్ణోగ్రతతో పాటు, ప్రజలు వేడిగాలుల(Heat Waves)ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం హీట్‌వేవ్‌కు సంబంధించి సూచనలు జరీ చేసింది. ఈ సూచనల్లో ఈ వేడి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉండాలో సూచించింది.
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, నల్గొండలో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఇది రెడ్ అలర్ట్ కేటగిరీలో వస్తుంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 43.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
మే 4వ తేదీ వరకు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని, ఆ తర్వాత మే 5 నుంచి 7వ తేదీ మధ్య కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే, అప్పటి వరకు ప్రజలు వేడిని(Heat Waves) భరించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో వేడిగాలుల కారణంగా వాతావరణ శాఖ-హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు(Heat Waves) ఉండబోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంటుంది.
Also Read: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది!
వేడి తరంగాలను నివారించడానికి ఏమి చేయాలి?
వడదెబ్బ(Heat Waves) నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఇచ్చిన సూచనల్లో.. ప్రజలు తమను తాము హీట్‌వేవ్ నుండి రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పింది. ఆ సూచనలు ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం..
- హైడ్రేటెడ్ గా ఉండండి: మీకు దాహం అనిపించకపోయినా, వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి. నిమ్మ నీరు, మజ్జిగ, లస్సీ లేదా ORS వంటి వాటిని కూడా ఉపయోగించండి.
- సీజనల్ పండ్లు - కూరగాయలు తినండి: పుచ్చకాయ, తర్బూజా, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి సీజనల్ పండ్లు - కూరగాయలను తినాలి.
- శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వాడండి: వేడిని నివారించడానికి, వదులుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించండి. మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి. అంటే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడండి. తద్వారా మీరు హీట్‌స్ట్రోక్ బారిన పడకుండా ఉండండి.
- మీ తలను కప్పుకోండి: ప్రజలు బయటకు వెళ్ళినప్పుడల్లా తమ తలలను టోపీ, గొడుగు లేదా ఏదైనా గుడ్డతో కప్పుకోవాలని ప్రభుత్వం కోరింది.
- ఇంట్లోనే ఉండండి: అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. ఇంట్లో చల్లని ఉష్ణోగ్రతలో ఉండటానికి ప్రయత్నించండి.
హీట్ వేవ్(Heat Waves) సమయంలో ఏమి చేయకూడదు?
బయటకు రావద్దు: మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. మీరు బయటకు వెళుతున్నట్లయితే, బయట వాతావరణంలో బరువులు మోసే లేదా శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయకండి.
- వేడిలో వంట చేయడం మానుకోండి: చాలా వేడిగా ఉన్నప్పుడు వంట చేయడం మానుకోండి. మీరు తప్పనిసరి అయి వంట చేస్తే వెంటిలేషన్ కోసం ఏర్పాట్లు చేయండి. వంటగది కిటికీలను పూర్తిగా తెరిచియు ఉంచుకోండి.
- ఎక్కువ చక్కెర తాగడం మానుకోండి: ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న పానీయాలను నివారించండి. పాత - అధిక ప్రోటీన్ ఆహారాన్ని కూడా నివారించండి.
పోలింగ్ సమయాల మార్పు:
మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వేడి పరిస్థితుల(Heat Waves) దృష్ట్యా పోలింగ్ సమయాన్ని మార్చింది ఎన్నికల కమిషన్. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవరాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఓటింగ్ ఓటింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది, అయితే పెరుగుతున్న వేడి దృష్ట్యా ఇప్పుడు ఓటింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.