Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29 మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. 

New Update
Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29 మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఇదే కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ కూడా ఈనెల 29న జరిగే అవకాశం ఉంది.

ఇక చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్‌ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్‌ క్యాటరిగీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles New Business: పచ్చళ్ల బిజినెస్ క్లోజ్.. కొత్త వ్యాపారంలోకి అలేఖ్య చిట్టి.. ఈసారి ఏంటంటే?

అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. త్వరలో రమ్య పేరుతో లడ్డూ బిజినెస్ ప్రారంభించబోతున్నారని అన్వేష్ తాజాగా చెప్పాడు.

New Update
Alekhya Chitti Pickles going to start a new business..

Alekhya Chitti Pickles going to start a new business

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం మూడు రోజుల నుంచి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీ మరింత ముదిరిన నేపథ్యంలో అక్కా చెల్లెల్లు సుమ, అలేఖ్య, రమ్య వెనక్కి తగ్గారు. ఈ మేరకు అలేఖ్య చేసిన తప్పుకు ముగ్గురూ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంలో ఘోరమైన ట్రోల్స్, విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది. అలేఖ్య తీవ్ర అనారోగ్యం బారిన పడిందని.. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉందని ఆమె సిస్టర్ చెప్పుకొచ్చిన ఆడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక ఈ వివాదం జరగడంతో వారు తమ పచ్చళ్ల బిజినెస్‌ను ఆపేశారు. అయితే ఆ బిజినెస్‌కు బ్రేక్ ఇచ్చి మరొక కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. ఈ మేరకు అలేఖ్య వివాదంపై అతడు స్పందించాడు. అలేఖ్య బూతులు మాట్లాడటం చాలా తప్పేనని అన్నాడు. వారి ముగ్గురిని తాను చెల్లెల్లుగా భావిస్తున్నానని.. దయచేసి వారిని క్షమించండి అని కోరాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కొత్త బిజినెస్‌లోకి అలేఖ్య చిట్టి

అంతేకాకుండా ప్రస్తుతం వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా మూతపడిపోయిందని చెప్పుకొచ్చాడు. అందువల్ల త్వరలో వారు మరొక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు.ఇక నుంచి అలేఖ్య పికిల్స్ బిజినెస్ తీసేసి త్వరలో రమ్య పేరుతో లడ్డూ వ్యాపారం చేయబోతున్నారని అన్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పూతరేకులు, లడ్డూలు, స్వీట్స్ వంటివి తయారు చేస్తారని తెలిపాడు. రేటు ఎక్కువగా ఉన్నా.. వీళ్లు క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అందువల్ల వీళ్లని వదిలేయండని.. అయిపోయిందేదో అయిపోయింది.. క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నాడు. దీనిబట్టి చూస్తే ఇకపై అలేఖ్య పేరుతో కాకుండా రమ్య పేరుతో ఈ లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news | naa anveshana)

Advertisment
Advertisment
Advertisment