Amla: ఉసిరిని మీ ఆహారంలో చేర్చటం లేదా.. అయితే మీరు లాభాలను కోల్పోయినట్లే..?

ఉసిరికాయ పుల్లగా ఉంటుంది అనే కారణంతో చాలా మంది తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని అనుకోరు. కానీ ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

New Update
Amla: ఉసిరిని మీ ఆహారంలో చేర్చటం లేదా.. అయితే మీరు లాభాలను కోల్పోయినట్లే..?

చాలా మంది తమ ఆహార పద్ధతుల్లో ఉసిరికాయను దూరంగా పెడతారు. కానీ ఉసిరిని(Amla) తీసుకోకపోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో అందవు. దాని వాళ్ళ శరీరంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఉసిరిని డైరెక్ట్ గా తీసుకోవడం నచ్చని వాళ్ళు దానిని ఇతర రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉసిరిలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వాళ్ళ దానిని మీ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉసిరిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు:
➡ ఉసిరికాయ తినటం నచ్చని వారు వేరే ఇతర రకాలుగా రోజు తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఏ విధంగా తీసుకున్నా సరే కానీ అది మీ డైట్ లో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

➡ ఉసిరికాయను నేరుగా తినటానికి ఇష్టపడని వాళ్ళు నిల్వ పచ్చడి రూపంలో చేసుకొని దానిని మనం తినే అన్నంలో కలిపి తింటే సరిపోతుంది.

➡ దాని పుల్లటి రుచి కారణంగా తినలేని వారు ఉసిరికాయను జ్యూస్ గా చేసుకొని దానిని మార్నింగ్ సమయంలో ఒక చెంచా తేనెతో కలిపి తాగితే సరిపోతుంది.

➡ దీనిని ఇంకో పద్దతిలో కూడా తీసుకోవచ్చు ఉసిరికాయను పొడిగా చేసి ఆ పొడిని మనం తినే సలాడ్స్ , స్మూతీస్ పై చల్లుకొని తినవచ్చు.

ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు..
* ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరి తినటం వల్ల మలబద్దకం(constipation). వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* ఇది జీర్ణ నాళాన్ని (digestive tract) ఆరోగ్యంగా ఉంచుతూ .. మోషన్ ఫ్రీగా ఉండటానికి సహాయపడుతుంది.

* దీనిని తినటం వల్ల జీర్ణ సమస్యలు మెరుగుపడతాయి. అలాగే అసిడిటీ, అజీర్ణం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అసిడిటీ( acidity) సమస్య వచ్చినప్పుడు అర చెంచా ఉసిరికాయ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో కలిపి తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ 'సి' గుణాలు శరీరానికి మాత్రమే కాదు చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడతాయి.

➡ ఉసిరికాయ పుల్లగా ఉంటుంది అనే కారణంతో చాలా మంది తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని అనుకోరు. కానీ ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

ALSO READ: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్!

Advertisment
Advertisment
తాజా కథనాలు