Health Tips: ఈ కూరగాయల తొక్కలను అస్సలు తీయకండి.. పోషకాలన్నీ మిస్ అవుతారు..! మీరు కూరగాయల తొక్కలు తీసేసి వంట చేస్తున్నారా? అయితే, మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే. కొన్ని రకాల కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా తొక్కల్లోనే ఉంటాయి. అందకే ఆ తొక్కలను అస్సలు తీసేయొద్దు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. దోసకాలు, క్యారెట్, వంకాయ, ఆలుగడ్డ, గుమ్మడికాయ తొక్క తీయకుండానే వండుకుని తినాలి. By Shiva.K 11 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Do Not Peeling These 5 Vegetables: ఆరోగ్యకరమైన ఆహారంలో(Food) కూరగాయలు కూడా ముఖ్యమైనవి. అవి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు(Proteins) పుష్కలంగా ఉంటాయి. అయితే, కొన్ని కూరగాయలపై తొక్కలు ఉంటాయి. ఈ తొక్కల్లోనే అవసరమైన పోషకాలు ఉంటాయి. కూరగాయల చర్మం, తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మంది ఈ కూరగాయలను వండుకునేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా.. తొక్కలను తొలగించేస్తుంటారు. కానీ, అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 5 రకాల కూరగాయల తొక్కలను తీసేయకుండా తింటేనే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ 5 రకాల కూరగాయలు ఏంటో ఓసారి చూద్దాం.. 1. బంగాళదుంపలు బంగాళాదుంపలు భారతీయ వంటకాలలో ప్రధానమైనవి. బంగాళదుంప తొక్కలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి మాంసం కంటే ఎక్కువ పొటాషియం కలిగి ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు అవసరం. బంగాళాదుంప తొక్కలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల వృద్ధికి కారణం అవుతుంది. అందుకే బంగాళదుంపై తొక్కను తొలగించొద్దని సూచిస్తున్నారు. అయితే, బంగాళదుంపను వండటానికి ముందు బంగాళ దుంపను శుభ్రంగా కడిగి వండుకుని తినడం వలన ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. 2. క్యారెట్లు క్యారెట్ తొక్క తినడానికి పూర్తిగా సురక్షితమైనది. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరమైనది. క్యారెట్ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బి3, డైటరీ ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మన ఆరోగ్యకరమైన చర్మం, కంటి చూపుని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్లో ఉండే బీటా-కెరోటిన్ కంటెంట్ మెరుగైన జీర్ణక్రియకు, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. 3. దోసకాయలు.. దోసకాయను తొక్కతో సహా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ Kతో సహా దోసకాయలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి తోడ్పడే సిలికా మూలాన్ని కలిగి ఉంటుంది. దోసకాయను తొక్కలతో సహా సలాడ్, స్నాక్స్ రూపంలో తినొచ్చుక. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. 4. వంకాయలు.. వంకాయల చర్మం నాసునిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది డైటరీ ఫైబర్‌ను కూడా అందిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వంకాయ కూర వండేటప్పుడు దాని తొక్క, కాండం తొలగించకుండా వంట చేయండి. అప్పుడే దాని ప్రయోజనాలను పొందుతారు. 5. గుమ్మడికాయ గుమ్మడికాయ లోపలి కాండం, తొక్క రెండూ మెరుగైన జీర్ణక్రియ, మెరుగైన మానసిక స్థితి, ఎముకల నిర్మాణం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీని తొక్కలు డైటరీ ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. గుమ్మడికాయ తొక్కతో అనేక రకాల వంటకాలు కూడా చేయొచ్చు. గుమ్మడికాయను వేయించినా, గ్రిల్ చేసినా, ఉడకబెట్టినా, తొక్కను అలాగే ఉంచి చేయాలి. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. Also Read: Big Breaking: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. ఈసీ కీలక ప్రకటన! Big Breaking: చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి