Salt: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు! ఉప్పు ఎక్కువగా తినడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక మోతాదులో సోడియం పేరుకుపోతుంది. దీని వల్ల సోడియం పలుచన చేయడానికి ఎక్కువ ద్రవాన్ని పట్టుకుంటుంది. By Bhavana 11 Nov 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మనం నిత్యం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉప్పు లేకుండా ఆహారం తినాలంటే అది ఎంతో కష్టం. ఉప్పు తినాలి కదా అని ఓ తినేయకూడదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే..అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మధుమేహం సమస్య వస్తుందని వైద్యులు తెలిపారు. అందుకోసం ఉప్పును మానుకోవడం చాలా మంచిది. దీని గురించి సుమారు నాలుగు లక్షల మంది పై పరిశోధనలు జరిపిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు ఉప్పు వేసుకొని వారు, అప్పుడప్పుడు ఉప్పు వేసుకునే వారు, ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారిని పరిశీలించిన తరువాత ఉప్పు ఎక్కువగా వేసుకునే వారికి షుగర్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక మోతాదులో సోడియం పేరుకుపోతుంది. దీని వల్ల సోడియం పలుచన చేయడానికి ఎక్కువ ద్రవాన్ని పట్టుకుంటుంది. దీని వల్ల అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది. ఇలాగే జరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో ఇన్ని సమస్యలు తలెత్తడం వల్ల మెదడు పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా తక్కువ శాతంలో ఉప్పు తినేవారికి షుగరు ముప్పు కేవలం 13 శాతం మాత్రమే ఉంటుంది. అప్పుడప్పుడు ఉప్పు వేసుకునే వారికి 20 శాతం, ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారి 39 శాతం షుగర్ వచ్చే ప్రమాదం కనపడుతోంది. ఊబకాయం ఉన్నవారిలో, కణ అంతర్గత వాపు ప్రక్రియ మరింత పెరుగుతున్నట్లు తేలింది. Also read: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా! #problems #health #salt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి