Non-Veg: నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే.. ఏమవుతుందో తెలుసా..! By Archana 15 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Avoiding Non-Veg: ఇది ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియుల కోసం.. నాన్ అంటే చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ లో రకరకాల ఐటమ్స్ ట్రై చేయడంతో పాటు వాటి రుచిని ఆస్వాదిస్తూ మరీ తింటారు. కొంత మంది ప్రతి రోజు నాన్ పెట్టిన.. బోర్ ఫీల్ అవ్వకుండా అదే పనిగా తింటారు. మరి కొంత మంది నాన్ వెజ్ లేకుండా ఉండాలంటే చాలా కష్టంగా భావిస్తారు. కానీ ఒక్క నెల రోజులు మానేసి చూడండి.. మీ శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. నాన్ వెజ్ మానేస్తే కలిగే లాభాలు జీర్ణక్రియ మెరుగుపడును నాన్ వెజ్ మానేసి.. కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్.. ఆకుకూరలు, కూరగాయలు తింటే.. వాటిలో అధికంగా ఉండే ఫైబర్ గుణాలు జీర్ణక్రియను మెరుగ్గా చేసి.. మలబద్దకం, వంటి సమస్యలను దూరం చేయును. అధిక బరువును నియంత్రించును జంతు సంబంధిత ఆహారాలతో పోలిస్తే మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో కెలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాదు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కావున కడుపు ఫుల్ గా ఉంది అనే భావన కలిగించి.. శరీరంలో కెలరీల శాతాన్ని తగ్గించును. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గును జంతు మాంసాహారాల్లో సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని నాన్ వెజ్ ఫుడ్స్ కంటే ఎక్కువగా మొక్కల నుంచే వచ్చే ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగును ఎక్కువగా చికెన్, మటన్, ఇతర నాన్ ఐటమ్స్ కాకుండా.. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటే వాటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. కణాలు దెబ్బ తినకుండ కాపాడుతాయి. అంతే కాదు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో వాపును తగ్గించును జంతు సంబంధిత ఆహారాలు, ప్రాసెస్డ్ మీట్ తినడం శరీరంలో వాపుకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకని మాంసాహారం తగ్గించడం, లేదా పూర్తిగా మానేస్తే శరీరంలో వాపుతో పాటు ఇతర హానికరమైన ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. నాన్ వెజ్ తింటే కొన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. కానీ తగినంత తీసుకుంటే చాలు అతిగా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. Also Read: Sprouts Health: రోజు వీటిని తింటే.. ఆరోగ్య సమస్యలన్నీ మాయం..! #health-benefits-of-avoiding-non-veg #benefits-of-avoiding-non-veg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి